Malli Nindu Jabili: మల్లి గౌతమ్ నా మీద ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు నిన్ను బాధ పెడుతున్నాడు అందుకే వాటికి అన్నిటికి ఒక సొల్యూషన్ తెస్తాను నువ్వే వర్రీ కాకు మల్లి అని అరవింద్ అంటాడు. అరవింద్ ఏం చేస్తున్నారు ఇదేమన్నా పార్క్ అనుకుంటున్నారా ప్రవేటుగ మాట్లాడుకుంటున్నారు రోజు ఆఫీసులో మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా పక్కకు వచ్చి మాట్లాడుకోవాల్సినంత ఏముంది అని మాలిని అంటుంది. ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను మాలిని అని అరవింద్ అంటాడు. నువ్వు నీ మొగుడితో ఉండు నా మొగుడితో కాదు అందరూ మనల్ని చూస్తే అక్కాచెల్లెళ్లు అని అనుకోవాలి సవ్వతలు అని అనుకోకూడదు అని మాలిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాజు గన్ను పట్టుకుని గుడికి వచ్చి అరవింద్ ఎక్కడ ఉన్నాడు కాల్ చేద్దామని వెతుకుతాడు.

మాలిని ఒకసారి ఇటు వస్తావా అని వసుంధర అంటుంది. ఏంటి అమ్మ అని మాలిని అంటుంది. ఆ మల్లి ని చూసావా కోటీశ్వరలు అయిపోయానని అనాగలు ఆ చీరలు పని మనిషిగా ఉన్న మల్లి ఇప్పుడు చూడు ఎలా వగలబోతుందో అని వసుంధర అంటుంది.చీరలు నగలు కట్టుకుంటే నేనేమి ఫీల్ అవ్వను మమ్మీ నా భర్త జోలికి వస్తే నేను తట్టుకోలేక పోతున్నాను అని మాలిని అంటుంది. గౌతమ్ కి మల్లి గురించి అంతా చెప్పాను కానీ ఏమి అనకుండా బాగానే చూసుకుంటున్నాడు నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నువ్వు కోరస్పాడు మాలిని అని వసుంధర అంటుంది. వద్దమ్మా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని మాలిని అంటుంది. మాలిని ఆడది ఒక పెళ్లి చేసుకొని భర్తను వదిలేసి మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది కొంపలు కూల్చేవాళ్ళు బాగానే ఉంటారులే అని వసుంధర అంటుంది.

చెప్పాల్సిన అవన్నీ ముందే చెప్పేసాము మళ్లీ వాటి గురించి ఎందుకు అని మీరా అంటుంది. అనే ముందు నీకు బుద్ధుండాలి అని కౌసల్య అంటుంది. పల్లెటూరు వాళ్లయినా మంచి మనసు ఉంది కానీ కొంతమందికి ఎంత డబ్బున్న గుణం అనేది చెడ్డగా ఉండిపోతుంది అని గౌతమ్ అంటాడు. అలా గడ్డి పెట్టండి బాబు అని జగదాంబ అంటుంది. గతాన్ని తొవ్వుకోవడం ఎందుకు వసుంధర గారు అని అనుపమ అంటుంది. అమ్మ ఇంక నువ్వు ఎన్ని చెప్పినా గౌతమ్ ఏమి పట్టించుకోడు నువ్వు ఇంకా అనొద్దు అని మాలిని అంటుంది. అమ్మ పూజ అయిపోయింది హారతి తీసుకోండి అందరూ అని పూజారి అంటాడు.

అందరూ హారతి తీసుకుంటూ ఉండగా రాజు అరవింద్ ని షూట్ చేస్తాడు. అది చూసిన గౌతమ్ అరవింద్ ని పక్కకి నెట్టేస్తాడు. రేయ్ అరవింద్ నీకేం కాలేదు కదా నాన్న అని వాళ్ళ అమ్మ అంటుంది. రేయ్ ఆగరా అని అరవింద్ రాజు వెనకాల పరిగెడతాడు రాజు దొరకగానే నిన్ను ఎవడురా పంపించింది అని అరవింద్ అంటాడు. రాజు అరవింద్ ని నెట్టేసి పరిగెడతాడు. నా కొడుకు ఏం పాపం చేశాడని ఈ దారుణానికి ఒడిగట్టారు అని అనుపమంటుంది. వాడు ఎవడైనా సరే వదిలి పెట్టకూడదు పోలీస్ కేసు పెడితే వాడే దొరుకుతాడు అని సుమిత్ర అంటుంది ఇంతలో అరవింద్ వస్తాడు.

కాల్చిన మనిషి ఎవరో మీకు కనిపించాడా బాబు గారు అని మల్లి అడుగుతుంది. చూశాను అని అరవింద్ అంటాడు. వాడెవడో చెప్పు అరవింద్ వాడి సంగతి నేను చూసుకుంటాను అని శరత్ అంటాడు. అతని ఇంతకుముందు మీరు ఎక్కడైనా చూశారా బాబు గారు అని మీరు అంటుంది. చూస్తే చెప్పండి బాబు వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు అని జగదాంబ అంటుంది అతని పేరు రాజు గౌతమ్ కి చాలా కావాల్సిన మనిషి అని అరవింద్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది