Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ పద్మావతి క్యారెక్టర్ లో నటిస్తున్న పవిత్ర బి నాయక్, ఈమె కన్నడ నటి. కన్నడంలో మరియు తమిళంలో చాలా సీరియస్ లో నటించి మెప్పించింది. కన్నడలో చేసిన సీరియల్స్ అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి ప్రస్తుతం ఈమె కన్నడంలో పారు అనే సీరియల్ లో నటిస్తుంది 2018లో మొదలైన ఈ సీరియల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఈమె 2021లో కాదంబరి అనే టెలివిజన్ సిరీస్ లో కనిపించింది. ఈమె చిన్నతనం అంతా బెంగళూరులోనే కొనసాగింది. ఈమె తెలుగులో నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ లో నటిస్తోంది.

తెలుగులో స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ మంచి పిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్లో పద్మావతి అనే క్యారెక్టర్ లో అచ్చ తెలుగు ఆడ పిల్లలాగా పద్మావతి నటిస్తోంది.2022లో ఈ సీరియల్ ప్రారంభమైంది

అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సీరియల్ లో పద్మావతి తనదైన నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈమె 1997 సెప్టెంబర్ 13వ తేదీన కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఈమె కొంతకాలం జాబ్ లో కూడా కొనసాగింది మోడలింగ్ తో ఇంట్రెస్ట్ తో అనేక ప్రింట్ యాడ్స్ ను చేసింది.

ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈమె సీరియల్స్ లో నటిస్తూ విరామం దొరికినప్పుడల్లా తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇక ఈమె రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో తన ఫ్రెండ్, తన చిన్ననాటి స్నేహితురాలని చూపించింది. తన ఫ్రెండ్ తో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది పవిత్ర. ఇప్పుడు ఆ ఫోటో చూసిన వారంతా మంచి ఫ్రెండ్స్ అని, మీ స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని కామెంట్స్ పెడుతూ ఫోటోని షేర్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఫోటోని మీరు ఒక లుక్ వేయండి మన పవిత్ర ఫ్రెండ్ ని మీరు చూసేయండి.