NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election 2023: నాడు కవితకు మాదిరిగానే నేడు కేసిఆర్ కు కొత్త సమస్యలు..బయటపడేందుకు బీఆర్ఎస్ యత్నాలు

Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని పరిస్థితిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తొంది. మరో పక్క బీజేపీ అధిష్టానం కూడా ఫోకస్ పెంచింది. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దా రామయ్య, డిప్యూటి సీఎం డీకే శివకుమార్ తదితరులు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలు కేసిఆర్ టార్గెట్ గా ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ తరుపున ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సహా పలువురు ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. అధికార బీఎస్ఎస్ పై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ముప్పెటదాడి చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే .. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ తొలిసారిగా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ నుండి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నుండి సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లు కూడా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కేసిఆర్ ను ఇరుకున పెట్టాలన్నఉద్దేశంతో రెండో స్థానంలో పోటీ చేసినట్లుగా కనబడుతోంది. ఈటల రాజేందర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హూజూరాబాద్ తో పాటు కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్లు నియోజకవర్గంతో పాటు కేసిఆర్ పై కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఈరకమైన పోటీ పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేదు.

ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్ధులతో తలపడటం ఒక ఎత్తు అయితే ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్ధులు బరిలో నిలవడం ప్రధాన పార్టీల అభ్యర్ధులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసిఆర్ తనయ కే కవితకు నిజామాబాద్ ఎన్నికల్లో స్వతంత్రులతోనే పెద్ద మైనస్ అయ్యింది. 2014 ఎన్నికల్లో అదే పార్లమెంట్ నియోజకవర్గం నుండి 1,67,184 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ పై విజయం సాదించిన కే కవిత .. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ పై 70,875 ఓట్ల తేజాతో పరాజయం పాలైయ్యారు. పసుపు, ఎర్ర జొన్న రైతులు ప్రభుత్వంపై తన నిరసన తెలియజేస్తూ భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. 245 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేసినా కొంత మంది రైతులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 180 మందికిపైగా స్వతంత్రులు బరిలో నిలవడంతో పోటీ చేసిన అభ్యర్ధులకు పది శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న రైతులు ఇండిపెండెంట్ లుగా పోటీ చేయడం వల్లనే ఆ ఓట్ల తేడాతోనే కవిత ఓడిపోయారు. ఇప్పుడు అటువంటి పరిస్థితే గజ్వేల్ లో కేసిఆర్ కు నెలకొంది.

కేసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పరిణామం గులాబీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తొంది. దీంతో వాటిపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. సీఎం కేసీఆర్‌పై నామినేషన్లు వేసిన బాధితులను నేతలు బుజ్జగిస్తున్నట్టు తెలుస్తొంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక, నామినేషన్లు వేసిన వారిలో వందకుపైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి ప్లాట్స్‌ బాధితులు, రైతులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలని రైతులు నామినేషన్లు వేశారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో, రంగంలోకి దిగిన బీజేపీ నేతలు వారిని నామినేషన్ లు ఉపసంహరించుకోవాలని బుజ్జగిస్తున్నారు. నాడు కవితకు మాదిరిగానే ఇప్పుడు కేసిఆర్ కు స్వతంత్రుల పోరు నెలకొందని అంటున్నారు. దీంతో గజ్వేల్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ బుజ్జగింపులతో ఎంత మంది స్వతంత్రులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారు..గులాబీ దళం ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

Telangana Election 2023: బీజేపీకి తుల ఉమ రాజీనామా .. ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారంటే..?

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju