Malli Nindu Jabili November 13 2023 episode 493: ఈ ఊర్లో గుడులు కొండలు ప్రకృతి అందాలు ఇంకా చూడలేదు కదా అందుకే అలా అన్నాను అని వనజాక్షి అంటుంది. గౌతమ్ కావాలంటే ఇంకోసారి వద్దం కానీ ఇప్పుడు వెంటనే మనం బయలుదేరి సిటీకి వెళ్లాలి, నాతోపాటు గుడి కమిటీ వాళ్లు కూడా వచ్చారు వాళ్లు శివపార్వతుల దగ్గర నుంచి పసుపు కుంకు అయితే ఒక జంటకు ఇస్తారంట అని కౌసల్య అంటుంది. అవును బాబు శివపార్వతుల పసుపు కుంకుమ అందుకునే మొదటి జంట చానా పుణ్యవంతులు మా గుడి తరపున నుంచి పశువు కుంకుమ ఎవరికి అందించాలి అని గౌతమ్ ని వాళ్లు అడుగుతారు. శరత్ అన్నయ్య మీరా వదిన గారు మీరు ముందుకు రండి మీకు ఇస్తారు అని కౌసల్య అంటుంది. సరేననే వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వబోతుండగా, వనజాక్షి ఆగండి మా అక్కకు దక్కాల్సిన గౌరవాన్ని ఎవరికో అడ్డమైన వాళ్లకు ఇస్తారా నేను ఒప్పుకోను అని వనజాక్షి అంటుంది.

వనజాక్షి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది అని శరత్ అంటాడు. ఎందుకు చేసుకోకూడదు బావగారు నేను చేసుకుంటాను మా అక్కకు దక్కవలసిన గౌరవం దారిన పోయే దానికి ఇస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను చెప్పండి , శివపార్వతుల పసుపు కుంకుమ అందుకోవాలి అంటే ఎంతో పవిత్రులై ఉండాలి ఆ బంధాన్ని నలుగురు ఒప్పుకోవాలి మలినం అయిపోయిన దానికి ఇస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని వనజాక్షి అంటుంది. చూడండి చిన్న అత్తయ్య గారు శరత్ మామయ్య పక్కన గాని నిలబడి మా అత్తయ్య పసుపు కుంకుమ అందుకోవాలంటే ఆవిడకి కావాల్సిన అర్హత ఏంటి ఎగ్జామ్ ఏమైనా రాయాలా ఐఏఎస్ ఎగ్జామ్ కూడా రాయాలా అని గౌతమ్ అడుగుతాడు.

అంతా నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు నువ్వు చాలా తెలివిగల వాడివి అనుకుంటున్నావు కదా చెప్తాను విను, శివపార్వతుల పవిత్రమైన పసుపు కుంకుమ అందుకోవాలి అంటే భర్త చేత మంగళ సూత్రాలు కట్టించుకుని ఉండాలి నుదిటినా భర్త చేతితో బొట్టు పెట్టించుకోవాలి నలుగురితో శరత్తు భార్య అని పేరు తెచ్చుకోవాలి అప్పుడు ఆవిడకి ఆ గౌరవం దక్కుతుంది

ఉండాల్సినవి మొదటి లక్షణాలు అవన్నీ మా అక్కకు మాత్రమే సొంతం ఈవిడ ఒంపుడు గత్త ఈవిడకి ఎలా ఇస్తారు వీళ్లది పవిత్ర బంధం కాదు కామంతో కూడుకున్న బంధం అని వనజాక్షి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంది.మల్లి కి కోపం వచ్చి ఇక ఆపండి అమ్మగారు మా అమ్మ గురించి నోటికొచ్చింది అలా మాట్లాడితే ఊరుకునేది లేదు, మా అమ్మ మా నాన్న చేత పందిట్లో తాళి కట్టించుకోకపోయినా మా నాన్నతో కలిసి నన్ను కన్నది అందుకు ఆవిడ అపవిత్రురాలు కాదు మా అమ్మ ఎంతో పవిత్రురాలు మీ అక్క కన్నా దేంట్లో తీసిపోలేదు మనుషులు బంధాల్లో ఉంటే సరిపోదండి గుణం కూడా మంచిదై ఉండాలి మి బుద్ధులు మలినమై పోయినప్పుడు మా అమ్మ చేసింది తప్పేముంది అని మల్లి అంటుంది.

మల్లి ఏంటి నోటికి వచ్చినట్టేలా మాట్లాడుతున్నావు చిన్న పెద్ద తేడా లేదా మా పిన్ని తో అలాగేనా మాట్లాడేది అని మాలిని అంటుంది.మా అమ్మను నా కళ్ళ ముందు అలా నిందిస్తుంటే ఏమీ మాట్లాడలేదు కానీ మీ పిన్నిని ఒక్క మాట అనేసరికి రోషం పొడుసుకు వచ్చిందా మా అమ్మ చేసిన తప్పేంటి ఎందుకు ఇంకా అవమానిస్తారు ఎన్నాళ్ళు మా అమ్మ భరించాలి ఆ మాటలకి అంతం అనేదే లేదా మా అమ్మ బాధకి తీర్పే లేదా ఎందుకు తనని చిన్నతనం చేసి మాట్లాడుతారు అని మల్లి ఏడుస్తుంది.చూడండి అత్తయ్య ఇంతకుముందు అంకుల్ తో మీరా అత్తయ్య గారు అగ్ర తాంబూలాలు పూజలు అందుకున్నది ఇప్పుడు కొత్తగా మళ్లీ మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అరవింద్ అంటాడు. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది అరవింద్ నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అని వనజాక్షి అంటుంది. మీరా నా చేత తాళి కట్టించుకోకపోయినా తను ఎంతో పవిత్రురాలు ఆ విషయం నాకు తెలుసు మీరు తెలిసి తెలియక వగాకండి అని శరత్ అంటాడు.

భార్య గురించి భర్త అంతలా చెప్పాడు తల్లి గురించి కూతురు చెప్తుంది ఇంతకంటే ఇంక మీకేం కావాలి అత్తయ్య అని గౌతమ్ అంటాడు. చూడు గౌతమ్ నిన్ను అమాయకుని చేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ నీ దగ్గర ఒక నిజాన్ని దాచి పెట్టారు అని వనజాక్షి చెప్పబోతుండగా, మాలిని పిన్ని నువ్వు ఎంత గొంతు చించుకొని అరిచినా మన పక్క మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు అంతా వాళ్ల పార్టీ నే దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా వదిలేస్తే మంచిది అని మాలిని అంటుంది. గట్ల అనకమ్మ నువ్వు వరంగల్లుల అక్క ఒక్కతే ఎంతమంది ఉంటే ఏముంది ఈలేం చేస్తారు అని యాదగిరి అంటాడు. యాదగిరి నీకు దండం పెడతాను కాసేపు నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటావా అని మాలిని అంటుంది.

చూడమ్మా కౌసల్యమ్మ గారు ఎవరో ఏదో అన్నారని నేనే ఇ మాట చెప్పడం లేదు శివపార్వతుల పసుపు కుంకుమ నా కూతురికి అల్లుడికి ఇప్పించండి అది చాలు నేను సంతోషిస్తాను అని మీరా అంటుంది. అత్తయ్య భయపడుతున్నారా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు. రేయ్ గౌతమ్ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయ్ నువ్వు మల్లి వచ్చి పసుపు కుంకుమ అందుకోండి అని కౌసల్య అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది