NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Deep Fake: డీప్‌ఫేక్ అడ్డుకట్టకు కేంద్రం కీలక నిర్ణయం

Deep Fake: డీఫ్‌ఫేక్ ల అడ్డుకట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీప్‌ఫేక్ ల పరిశీలన ఫిర్యాదుల కొరకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా సంస్థలతో సమావేశం అనంతరం కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. రెండు రోజుల కీలక సమావేశాల సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా విధి విధానాల రూపకల్పనకు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.

డీప్ ఫేక్ కంటెంట్ పై చర్య తీసుకునేలా అధికారిని నియమిస్తామని సోషల్ మీడియా కంపెనీలను కలిసిన తర్వాత మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశాన్ని చెప్పారు.  ప్రస్తుత ఐటీ రూల్స్ లోని రూల్ 31(14)(బీ)ని ఉల్లంఘించే కంటెంట్ ను వినియోగదారు ఫిర్యాదు చేసిన 36 గంటల్లో నిర్దిష్ట కంటెంట్ ను తొలగించాలని తెలిపారు.  డీప్ ఫేక్ లు, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మేటీరియల్ వంటివి కంటెంట్ ప్రస్తుతం భారతీయ ఇంటర్నెట్ లో ఆందోళన కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు ఐటీ రూల్స్ ఉల్లంఘించిన సందర్బాలను వినియోగదారులు తెలిపేందుకు డిజిటల్ ప్లాట్ ఫారమ్ ను రూపొందించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్ సెవెన్ అధికారిని నియమిస్తుందని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

ఉల్లంఘనలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. ఈ డిజిటల్ ప్లాట్ ఫారమ్ ను వినియోగదారులు చేసిన ఫిర్యాదు ను పరిష్కరించేందుకు ఉపయోగిస్తారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు నిర్దిష్ట రకాల కంటెంట్ ను సృష్టించడం అనుమతించబడదని తమ వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ప్రస్తుత నియమాలు, చట్టాలు డీప్ ఫేక్ లను అనుమతించకూడదని అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు అంగీకరించాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

ఐటీ రూల్స్ 2021 ప్రకారం నిర్దేశించిన వ్యవధిలోపు  లేదా రిపోర్టింగ్ చేసిన 36 గంటల్లోపు ఆ కంటెంట్ ను తొలగించాలనీ లేదంటే చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. డీప్ ఫేక్ లను సృష్టించినా, వ్యాప్తి చేసినట్లు రుజువైనా లక్ష రూపాయల వరకూ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదని ఇప్పటికే ప్రకటించారు. ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా పుట్టుకొస్తున్న డీప్ ఫేక్ లను వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం ప్రకటించారు.

Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం పంపిణీ చేసిన పవన్ కళ్యాణ్ .. వైసీపీ సర్కార్ పై ఆగ్రహం

Related posts

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N