NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: విశ్రాంత ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటి వద్ద తనిఖీల హైడ్రామా

Telangana Election: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందని తెలుస్తొంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు, నేతల ఇళ్లల్లో, వాహనాల్లో తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.

తాజాగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 22 లోని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసానికి శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో ప్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలకు చేరుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. గోయల్ నివాసంలో భారీగా డబ్బు డంప్ చేశారన్న సమాచారం అందడంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టేందుకు వచ్చింది. ఏకే గోయల్ పదవీ విరమణ అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీ కోసమే డబ్బులు దాచి పెట్టారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోయల్ నివాసానికి అధికారులు రావడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అలానే బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే గోయల్ ఇంటి నుండి పలువురు మఫ్టీలోని కానిస్టేబుళ్లు నెంబర్ ప్లేట్ లేని బైక్ లపై డబ్బు బయటకు తీసుకువెళుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అయితే గోయల్ నివాసంలోకి వెళ్లిన అధికారులను ఆయన అడ్డుకున్నట్లు తెలుస్తొంది. సెర్చ్ వారంట్ లేకుండా ఇంట్లోకి రావడానికి వీలులేదని చెప్పినట్లు తెలుస్తొంది. దాదాపు నాలుగు గంటల పాటు వేచి ఉన్న ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి సెర్చ్ వారంట్ లేకపోవడంతో వెనుతిరిగినట్లు సమాచారం.

మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో డబ్బులు ఉంటే సీజ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు.  వందల కోట్ల డబ్బు ఏకే గోయల్ ఇంట్లో ఉందని తమకు సమాచారం అందిందన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారని అన్నారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అయిదు మోటారు సైకిళ్లపై డబ్బులు తరలించారని, ఆ వాహనాలకు ముందు, వెనకాల నెంబర్ ప్లేట్స్ లేవని మల్లు రవి చెప్పారు. ఏకే గోయల్ ఇంట్లో సుమారు రూ.200 కోట్ల నగదు ఉన్నట్లు గా భావిస్తున్నామన్నారు.

Deep Fake: డీప్‌ఫేక్ అడ్డుకట్టకు కేంద్రం కీలక నిర్ణయం

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju