NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీలో కీలకంగా రీజినల్ కోఆర్డినేటర్ లు .. ఏయే జిల్లాలు ఎవరు పర్యవేక్షిస్తున్నారంటే..?

YSRCP: రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను నియమించిన సీఎం జగన్.. ఇటీవల గోదావరి జిల్లాలపై కసరత్తు పూర్తి చేశారు. తాజాగా ఉత్తరాంధ్ర పై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ ఇన్ చార్జిల మార్పు పై రిజనల్ కోఆర్డినేటర్ లకు సీఎం వైఎస్ జగన్ సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తొంది. తాడేపల్లి కేంద్రంగా కొద్ది రోజులుగా అభ్యర్దులు, ఇన్ చార్జి ల మార్పులపై కసరత్తు జరుగుతుండగా, వైసీపీలో పెద్ద ఎత్తున ఊహగానాలు వినిపిస్తున్నాయి.

ap cm ys jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యే అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)నే పక్కన పెట్టారు అంటే ప్రక్షాళన విషయంలో సీఎం జగన్ ఎటువంటి మొహమాటాలకు వెళ్లరని స్పష్టం అయ్యింది. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు అనుమానంతో తమ పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకునేందుకు సీఎంఓ కు వెళ్లినా సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించడం లేదు.

పార్టీ రీజనల్ కోఆర్డినేటర్  లతో సమావేశం కావాలని సమాచారం ఇస్తున్నారుట. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు ఆయా జిల్లాలు పర్యవేక్షించే రీజనల్ కోఆర్డినేటర్ ల ను కలిసే పనిలో ఉన్నారు. సర్వే రిపోర్టులు, రీజనల్ కోఆర్డినేటర్ లు ఇచ్చిన నివేదికల ఆధారంగానే నియోజకవర్గాల ఇన్ చార్జిలను మారుస్తున్నట్లుగా తెలుస్తొంది. ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ లు పార్టీలో కీలకం అయ్యారు. జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్ లు నియోజకవర్గ ఇన్ చార్జిలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడుతున్నారు.

వైసీపీ రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్లు – వారు చూస్తున్న జిల్లాలు

  • బొత్స స‌త్య‌నారాయ‌ణ – పార్వ‌తీపురం మ‌న్యం, శ్రీకాకుళం
  • వైవీ సుబ్బారెడ్డి – విశాఖ‌ప‌ట్నం,అన‌కాప‌ల్లి,విజ‌య‌న‌గ‌రం,అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలతో పాటు పాడేరు,అర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు
  • మిథున్ రెడ్డి – తూర్పుగోదావ‌రి, కాకినాడ‌, కోన‌సీమ‌, అల్లూరి సీతారామ‌రాజు(రంప‌చోడ‌వ‌రం), ప‌శ్చిమ‌ గోదావ‌రి, ఏలూరు జిల్లాలు
  • ఆళ్ల అయోధ్య‌ రామిరెడ్డి, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ – కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు
  • విజ‌య‌సాయిరెడ్డి – ప‌ల్నాడు, బాప‌ట్ల‌, ప్ర‌కాశం, నెల్లూరు, తిరుప‌తి
  • పొన్న‌పురెడ్డి రామ‌సుబ్బారెడ్డి – క‌ర్నూలు, అన్న‌మ‌య్య‌
  • ఆకేపాటి అమ‌ర్నాధ్ రెడ్డి – వైఎస్సార్, నంద్యాల‌
  • పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి – చిత్తూరు, అనంత‌పురం,  స‌త్య‌సాయి జిల్లాలు

RK Roja: వైసీపీ నుండి బయటకు వెళ్లే వారిపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?