NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 2nd 2024 Episode 98: వసంత ని సుధాకర్ ని హారతి మీద ఒట్టు వేసి నిజం చెప్పమంటున్న చంగయ్య..

Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights

Mamagaru January 2nd 2024 Episode 98: చంగయ్య నాలుగో ఫ్లోర్ కు వెళుతూ ఉంటాడు. వసంత మెట్లు దిగుతూ ఉండగా చ0గయ్య కనపడతాడు వెంటనే దాక్కుంటుంది వసంత. ఇప్పుడు ఏం చేయాలి నాన్న పైకి వెళ్తున్నాడు అని సుధాకర్ గంగ కి ఫోన్ చేసి గంగ ఒక ఐడియా చెప్పమ్మా అని అంటాడు. ఏమైంది బావగారు అని గంగా అంటుంది. నాన్న నాలుగులో ఫ్లోర్ వెళ్తున్నాడు అక్కడ వసంత ఉంది నాన్న చూస్తే ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను అమ్మ ఏదైనా ఐడియా ఉంటే చెప్పు అని గంగాధర్ అంటాడు. అన్న మళ్లీ మేము వచ్చి షాప్ తర్వాత చూస్తాము అని గంగాధర్ ని తీసుకొని మూడు ఫ్లోర్ కి వస్తుంది గంగ. గంగ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి మూడో ఫ్లోర్ రండి మామయ్య గారు ఇక్కడ షాప్ చూడడానికి వచ్చాము సూర్య కాంప్లెక్స్ లో ఉన్నాము అని గంగా అంటుంది.

Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights
Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights

అమ్మ నేను కూడా అదే కాంప్లెక్స్ లో ఉన్నాను ఇప్పుడు మళ్లీ మూడో ఫ్లోర్ కు రావాలా వద్దులేమ్మా నువ్వే చూడు అని చ0గయ్య అంటాడు. మామయ్య గారు షాప్ చూడడం నా వంతు కాని బేరం మాట్లాడడం మీరే కదా రేటు తెలియదు రండి అని గంగా రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఉండండి వస్తాను రాక చస్తానా అని చ0గయ్య వెళ్తాడు. ఏంటి గంగ నన్ను మళ్ళీ మూడు ఫ్లోర్ దాకా రప్పించావు అని చ0గయ్య అంటాడు. ఇంతలో చ0గయ్య కి వడ్డీ డబ్బులు ఇచ్చే అతను చంగయ్య గారు నేను ఇప్పుడే కిందికి వచ్చాను వెళ్ళిపోతున్నాను అండి నాకు అర్జెంటు పని ఉంది తర్వాత కలిసి డబ్బులు ఇస్తాను అని అతను వెళ్ళిపోతాడు. అరే వస్తున్నాను ఉండండి నాలుగో ఫ్లోర్ నుంచి కిందికి వస్తున్నాను వడ్డీ డబ్బులు ఇచ్చిన తర్వాతే వెళ్లండి అని చ0గయ్య అంటాడు. ఉండండి గంగ మళ్ళీ వస్తాను అంటూ చ0గయ్య కిందికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights
Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights

చంగయ్య కిందికి వెళ్తాడు. బావగారు మామగారికి కిందికే వస్తున్నారు మీరు అక్కని తీసుకొని తొందరగా వెళ్ళిపోండి అని గంగా సుధాకర్ కి ఫోన్ చేసి చెప్తుంది. రా వసంత నాన్న వచ్చేస్తున్నాడు తొందరగా వెళ్ళిపోదాం అని సుధాకర్ బైక్ స్టార్ట్ చేస్తాడు అబ్బా ఉండండి వచ్చేస్తున్నాను అంటూ వసంత బైక్ ఎక్కి కూర్చుంటుంది. కంగారులో సుధాకర్ బండి తీసేటప్పుడు వాళ్ళ బండికి ఉన్న సంచి కింద పడిపోతుంది  అది చూసుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు. చ0గయ్య అక్కడికి వచ్చేసరికి అతనికి వడ్డీ డబ్బులు ఇచ్చే అతను వెళ్ళిపోతాడు కానీ అక్కడ వసంత వాళ్ళ సంచి కింద పడుతుంది ఆ సంచిని తీసుకుంటాడు చ0గయ్య. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights
Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights

అమ్మ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నాన్న అక్కడికి రావడం ఏంటి నన్ను అన్ని ప్రశ్నలు అడగడం ఏంటి నేను తడబడడం ఏంటి నాకైతే గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా కంగారులో ఇన్సూరెన్స్ ఇప్పించడానికి వచ్చాను అని పాండురంగని పేరు చెప్పేశాను అని సుధాకర్ అంటాడు. అన్నయ్య అక్కడ కూడా నా పేరే వాడవా ఎందుకు అని పాండురంగ అంటాడు. ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాము అత్తయ్య కానీ మామయ్య చూసేసాడు ఏమో వచ్చి అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి అని వసంత టెన్షన్ పడుతుంది. అక్కడి నుంచి చాలా ఈజీగా తప్పించుకున్నాము కానీ ఇంటికి వచ్చాక ఉంటుంది అని సుధాకర్ అంటాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights
Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights

ఇంతలో గంగా గంగాధర్ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఏమైంది బావగారు ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని గంగా అడుగుతుంది. అసలేం జరిగిందో తెలుసా గంగా అని అక్కడ జరిగిందంతా పాండురంగ చెప్తాడు. నేను మామయ్య గారిని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను బావగారు కానీ కిందికి వచ్చేసారు అని గంగా అంటూ ఉండగా ఇంతలో చ0గయ్య రానే వస్తాడు. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు ఇక్కడ ఏం సమావేశం చేస్తున్నారు ఏరా సుధాకర్ వెళ్లిన పని అయిపోయిందా ఇద్దరు తిరిగి వచ్చేసారు అని చంగయ్య అంటాడు. అయిపోయింది నాన్న అందుకే తిరిగి వచ్చేసాము అని సుధాకర్ అంటాడు. వెళ్లిన పని పూర్తి చేసుకొని వచ్చారు అంతే చాలు పని ఏదైనా పెండింగ్ పెట్టకూడదు రా అబ్బాయి కానీ మీ మాటల్లో మీ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అదేంటో నాకు తెలియట్లేదు గతంలో కూడా ఇలాగే నాకు అనుమానం వచ్చి అడిగితే అందరూ అబద్ధం చెప్పారు ఇప్పటికైనా నిజం చెప్పండి అసలు మీరు ఎందుకు బయటకు వెళ్లారు ఏం చేశారు  అని చంగయ్య అంటాడు. ఏమీ లేదు మామగారు మేము పనుండే బయటికి వెళ్ళాము వచ్చేసాము ఇంకేం మర్చిపోలేదు అన్ని సవ్యంగానే చేసాము అని వసంత అంటుంది. అవునా అని చ0గయ్య సిరిని పిలుస్తాడు. సిరి వసంత వాళ్ళు పడేసుకున్న బ్యాగు ని తీసుకువస్తుంది. మీరు అన్ని తీసుకొని వచ్చాను అంటున్నారు పని సక్రమంగా చేశామంటున్నారు కానీ ఆ పని ఏంటో నాకు చెప్పడం లేదు  అని చ0గయ్య శ్రీలక్ష్మిని పిలిచి నువ్వు వెళ్లి దేవుడికి హారతి ఇచ్చి తీసుకురా అమ్మ అని అంటాడు. ఎందుకు మామగారు అని శ్రీలక్ష్మి అంటుంది. నేను చెప్పింది చెయ్ అమ్మ దేవుడికి హారతి ఇచ్చి తీసుకురా తీసుకోవాలి అని చ0గయ్య అంటాడు.

Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights
Mamagaru Today Episode January 2nd 2024 Episode 98 Highlights

శ్రీ లక్ష్మీ లోపలికి వెళ్లి హారతి తీసుకొని వస్తుంది. గతంలో ఇంతకుముందు కూడా ఇలాగే అడిగాను కానీ అప్పుడు నిజం దాచారు ఇప్పటికైనా నిజం చెప్తారా లేదంటే అని చ0గయ్య అంటాడు. ఏంటండీ మీరు మరీను పిల్లని భయపెట్టేస్తున్నారు అని దేవమ్మ అంటుంది. గతంలో చేసిన తప్పులకి మొన్నటిదాకా శిక్ష అనుభవించావు మళ్లీ నువ్వు ఇందులో తలదూర్చకు వాళ్లను ప్రోత్సహించేది నువ్వే అని నాకు తెలుసు అని చ0గయ్య వసంత సుధాకర్ వైపు తిరిగి ఈ హారతి మీద ఒట్టేసి చెప్పండి మీరు అబద్ధం చెప్పలేదని అని అంటాడు చ0గయ్య. హారతి మీద ఒట్టు వేసి అబద్ధం చెప్పకూడదు ఇప్పుడు దొరికిపోతాం ఎలా అని గంగా కంగారుపడుతుంది. సుధాకర్ వసంత టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు చెప్పింది నిజమే కదా చెప్పండి హారతి మీద ఒట్టేసి అని చంగయ్య గట్టిగా బెదిరిస్తాడు. వసంత సుధాకర్ చేతులు పెట్టబోతూ ఉండగా శ్రీలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ షాక్ అయిపోయి శ్రీ లక్ష్మీ ఏమైంది నీకు ఏమైంది నీకు అని కంగారు పడిపోతూ ఉంటారు. పాండురంగడు అయ్యో శ్రీలక్ష్మి అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండిపోయాయి పిల్లలకు సవతి తల్లి వస్తే ఎలా చూసుకుంటుంది అని బోరు మనీ ఏడుస్తూ ఉంటాడు. శ్రీ లక్ష్మీ ఒక్కసారి కళ్ళు తెరిచి ఇలా సైగ చేస్తుంది పాండురంగనికి. అది చూసిన పాండురంగ ఇంకా రెచ్చిపోయి ఏడుస్తూ ఉంటాడు. రేయ్ తన ప్రాణాలు ఏమీ పోలేదు స్పృహ తప్పి పడిపోయింది ఎందుకో చూడండి అని చంగయ్య అంటాడు. ఏంటి నాన్న నీకేం తెలుసు శ్రీలక్ష్మి నువ్వు బెదిరించే బెదిరింపులకి తట్టుకోలేక కింద పడిపోయింది శ్రీలక్ష్మి కి ఏమన్నా అయితే పిల్లలు అనాధలు అయిపోతారు నాన్న నేను భార్య లేని వాని అయిపోతాను నీకేం తెలుసు అని పాండురంగ అంటాడు. పాండురంగ ఏడుపు చూసి చ0గయ్య ఆశ్చర్యపోతాడు..

Related posts

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu