NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధించిన పార్టీతోనే షర్మిల కలిశారని వ్యాఖ్యానించారు.

sajjala Rama Krishna Reddy

వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టమని అన్నారు. ఇదే క్రమంలో చంద్రబాబుపైనా విమర్శలు చేశారు సజ్జల. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు.

సీఎం జగన్మోహనరెడ్డి విషయంలో ప్రజలా.. కుటుంబమా అన్న ప్రశ్న వస్తే ఆయన ఛాయస్ ప్రజలేనని అన్నారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు ఫలితం ఏమయ్యిందో అందరికీ తెలుసునని అన్నారు.

వైఎస్ జగన్ తన కుటుంబం కోసం పార్టీ లేదని అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా జనం ఎరిగిన నేతగా జగన్ దూసుకుపోతున్నారని అన్నారు. ఎంత మంది వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని చెప్పారు. ఇదే సందర్భంలో పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపైనా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువగా గెలుపు  గుర్రాలను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నియోజకవర్గాల్లో మార్పులు ఏ పార్టీలో అయినా  అంతర్గతంగా జరగాల్సిన కసరత్తేనని అన్నారు. అసంతృప్తి నేతలను నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పార్టీ ఇన్ చార్జిలు, ఎమ్మెల్యేల మార్పులు చేసిన చోట స్పందన బాగానే ఉందని అన్నారు.

అంగన్ వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని సజ్జల సమర్ధించారు. అంగన్ వాడీలు సమ్మె మొదలు పెట్టి నెల రోజులు అవుతోంది. వారికి నచ్చచెబుతున్నా వినకపోవడంతో ఎస్మా ప్రయోగించామని అన్నారు. బాలింతలు, పసి పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు సజ్జల. తాము సంయమనంతో ఉన్నామనీ, ఒకటి రెండు డిమాండ్ లపై అంగన్ వాడీలు పట్టుబడుతున్నారని సజ్జల అన్నారు.

Narayana Collage: నారాయణ కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ..అస్వస్థతకు గురైన వందలాది మంది విద్యార్థినులు

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju