Mamagaru January 10 2024 Episode 105: నువ్వు నా సిద్ధాంతాలు నమ్మట్లేదు కదా దేవమ్మ అని చ0గయ్య అంటాడు. భార్యాభర్తలు అంటే వేరువేరు కుటుంబాల నుంచి వచ్చి ఒకటై ఒకటిగా బతుకుతారండి అలాంటి దాంపత్యంలో బేదాలు ఏంటండీ అని దేవమ్మ అంటుంది. నేను కోడళ్ళని కోడలుగా చూస్తుంటే నువ్వు కూతుర్లుగా చూస్తావా దేవమ్మా అని చ0గయ్య అంటాడు. అందరూ గజిబిజిగా తయారయ్యే వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వెళ్లిపోతారు పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు. కట్ చేస్తే,
చ0గయ్య అన్ని చూస్తూ కూర్చుంటాడు. శిరీష వచి నాన్న నేను బ్యాంకు జాబ్ కోసం ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నాను అని అంటుంది. మీ వదినలు ముగ్గురు భుజాలకు బ్యాగులు తగిలించుకొని ఉద్యోగాలకు వెళ్తుంటే నీకు వెళ్లాలని ఆశ పుట్టిందా అమ్మ అని చ0గయ్య అంటాడు. రేపు ఎలాగో అత్తగారి ఇంటికి వెళ్ళాక జాబ్ చేయమని అంటారు కదా ఇప్పటినుంచి చేస్తే ప్రాక్టీస్ అవుతుంది అని శిరీష అంటుంది. నీ కూతురు ఏమంటుందో విన్నావా దేవమ్మ అయినా నువ్వేమంటావులే కోడలనే కూతుర్లుగా చూస్తున్నా నువ్వు కూతురు జాబ్ చేస్తానంటే వద్దంటావా ఏంటి అని చంగయ్య అంటాడు. ప్లీజ్ నాన్న అని శిరీష అంటుంది. వద్దమ్మా బలవంతన్న వాళ్ళని ఉద్యోగాలకు పంపించాల్సి వస్తుంది నువ్వైనా నా సిద్ధాంతాలని నమ్మమ్మ అత్తగారు పొమ్మంటే అప్పుడు చేద్దువు గాని అది వాళ్ళ ఇష్టం నీ ఇష్టం ఇక్కడ ఉన్నంతకాలం నేను ఉద్యోగానికి పంపించను అని చ0గయ్య అంటాడు. శిరీష నువ్వు బాధపడకు నువ్వు ఎలాగైనా జాబ్ ఎగ్జామ్ రాదువు గాని ఉద్యోగం చేయద్దు నువ్వు ఎలాంటి తొందరపడకు అని గంగా నచ్చచెప్తుంది. కట్ చేస్తే,
చంగయ్య వసూళ్లకు బయలుదేరుతాడు. ఊళ్లో పెద్ద మనుషులందరూ పిలిచి ఇలా రా చ0గయ్య కూర్చో అని అంటారు. చంగయ్య కూర్చున్న అక్క మనుషులు మారుతూ ఉంటారు కాలాలు మార్పు చెందుతూ ఉంటాయి ఒక పెద్ద మనిషి సిద్ధాంతాలని కట్టుబాట్లని పెట్టాడు కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలు చేయక పోతే బయటికి వెళ్లిపోతాము అంటే చచ్చినట్టు ఆ పెద్దాయన ఒప్పుకున్నాడు అని అక్కడ ఉన్న ఒక పెద్దాయన అంటాడు. ఏంటి పేరు చెప్పకుండా నా గురించే మాట్లాడుతున్నావా అని చ0గయ్య అంటాడు.ఏంటి చంగయ్య గారు నీ కోడల్ని ఉద్యోగాలకు పంపిస్తున్నావా నీ సిద్ధాంతాలు ఏమయ్యాయి అని అక్కడ ఉన్న వాళ్ళు అంటారు. కోడి ఎంత అరిచినా కోస్తే కూర అవ్వక తప్పదు కదా పెద్దరికం కూడా అంతేనండి మీరు ఏదైతే ఊహించారో అదే జరుగుతుంది అని అతను అంటాడు.మీ పిచ్చి గాని చంగయ్య గారు గుప్పెట్లో నిప్పును బంధించాలంటే జరిగే పనేనా చెప్పండి సిద్ధాంతాలు లేవు పద్ధతిలు బంధాలు ఏమీ లేవయ్యా మనమే అనవసరంగా గింజుకుంటున్నాం అని అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ పక్కపక్క నవ్వుతారు చంగయని చూసి. చ0గయ్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే.
మేడం ప్రమోద్ కుమార్ కేసు పెట్టింది మేమే మేడం మీరు అనవసరంగా కేసును పెద్దది చేస్తున్నారు అని లాయర్ అంటాడు. సరే నేను కొత్త లాయర్ ని అయనా మీ వైపు న్యాయం ఉండి ఆ స్థలం మీద అయితే మీరు గెలుస్తారు లేదంటే మేం గెలుస్తాం దానికి ఎందుకండి మీరు అంతలా టెన్షన్ పడతారు అని వసంత అంటుంది. చూద్దాం మేడం మీరు గెలుస్తారు మేము గెలుస్తాము కోర్టులో తేల్చుకుందాం అని లాయర్ అంటాడు. ఇరుపక్షాల వాదాలు విన్న తర్వాత ఈ కేసుని రేపటికి వాయిదా వేయడమైనది అని జడ్జి గారు అంటారు . కట్ చేస్తే,
నా ఇంట్లో ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారో లేదో ఊళ్ళో వాళ్ళందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు నా పద్ధతులు నా ఆచారాలు పెట్ట బట్టి నా ఉమ్మడి కుటుంబం నిలబడింది నేను అదుపులో పెట్టుకోవాలంటే మల్లి నేనేం చేయాలి అని చ0గయ్య ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే,
అందరూ ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో వసంత వచ్చి అత్తయ్య నాకు కంగ్రాట్స్ చెప్పండి నేను కోర్టులో కేసు గెలిచేసె అంత వరకు వచ్చింది అని వసంత అంటుంది. వసంత నీ కోర్టు విషయాలు కాసేపు పక్కన పెట్టు పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడుతున్నాం అందరం అని దేవమ్మ అంటుంది. ఇంతలో చ0గయ్య ఇంటికి వస్తాడు. ఏంటి నేను వచ్చేసరికి అందరూ సైలెంట్ అయ్యారు అని చ0గయ్య అంటాడు. ఏమీ లేదు నాన్న అని పాండురంగ అంటాడు. ఇంతలో గంగా గంగాధర్ కూడా ఇంటికి వస్తారు. నాన్న నీ చేతిలో ఏంటది అని పాండురంగ అంటాడు. ఈ పేపరు గోడకి అతికించబోతున్నాను అందరూ చూసుకొని చదువుకోండి అని చంగయ్య అంటాడు. నేను అతికించనా నాన్న అని గంగాధర్ అంటాడు. ఎవరు పనులు వాళ్లే చేసుకోవాలి రా ఒకరి మీద ఆధారపడకూడదు అని చ0గయ్య దాన్ని అతికిస్తూ ఉంటాడు..