NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Narendra Modi: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర పర్యటన ఇలా..

PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ముందుగా లేపాక్షిలోని వీరభద్ర దేవాలయాన్ని సందర్శం చి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగులో ఉన్న రంగనాథ రామాలయంలోని పద్యాలను కూడా ప్రధాని మోడీ విన్నారు. ఆలయ అధికారులు, పూజారులు .. ఆలయ స్థల పురాణాన్ని తోలు బొమ్మలాట ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ ప్రదర్శనను ప్రధాని మోడీ ఆసక్తిగా తిలకించారు.

ఆలయంలో పూజల అనంతరం వేదపండితుల వద్ద ప్రదాని మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గోరంట్ల మండలం  పాలసముద్రం సమీపంలో రూ.541 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు. నార్కోటిక్స్ అకాడమి (నానిన్) ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్,  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ..చారిత్రక ప్రదేశంలో నానిన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్ఠానం చేస్తున్నట్లు చెప్పారు. పుట్టపర్తి సత్యసాయి జన్మస్థలం అన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు అని అన్నారు. గతంలో పన్నుల విధానం అర్ధం అయ్యేది కాదని జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేసామని చెప్పారు.

ప్రజల నుండి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికి వాడాలన్నారు. ఇదే రామరాజ్యం సందేశం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీకి నానిన్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్ స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందన్నారు. నాసిన్ తో ఏపీకి ప్రపంచ స్థాయి గుర్తింపు రానుందని అన్నారు. ఏపీ పేరును నానిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుందన్నారు. నానిన్ అకాడమి ఏర్పాటు చేసిన ప్రధాని మోడికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

503 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నాసిన్

పాలసముద్రం సమీపంలో 44వ  జాతీయ రహదారికి అనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణా కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడ నుండి గంటలో చేరుకునేంత దూరంలో ఉండటం ఈ కేంద్రానికి కలిసివచ్చే అంశం. ఐఏఎస్ లకు ముస్సోరి, ఐపీఎస్ లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. అవరణలోనే సోలార్ సిస్టం కూడా ఇప్పటికే సిద్దం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకువచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Telangana MLC Election: ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్  .. ఆ ఇద్దరికీ ఛాన్స్  

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju