NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిలతో వివేకా కుమార్తె సునీత భేటీ .. రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్లే(నా)..?

YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఆక్క చెల్లిళ్లు అయినప్పటికీ ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తొంది.

షర్మిల పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత కలవడం ఇదే తొలి సారి. సమావేశం అనంతరం వీరు ఇద్దరు కలిసి వైఎస్ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు.  అయితే వీరి భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తొంది. తన తండ్రి హత్యపై సునీత తొలి నుండి గట్టిగా పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే.

YS Sharmila

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్టు కూడా అయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కరరెడ్డితో పాటు ఇతరులు చంచల్ గూడ జైల్ లో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు నుండి బెయిల్ పొందారు. దీనిపై సునీత సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఓ పక్క నిందితులపై న్యాయపోరాటం చేస్తూనే మరో పక్క ఆ వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే షర్మిలను సునీత కలిశారని ప్రచారం జరుగుతోంది.

కాగా, పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతం కోసం ఇచ్చాపురం నుండి బయలుదేరిన వైఎస్ షర్మిల వరుసగా జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి కొన్ని స్థానాలను అయినా గెలిపించి కాంగ్రెస్ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. ఇవేళ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల పాల్గొననున్నారు.

RK Roja: మంత్రి ఆర్కే రోజాకు స్థాన చలనం తప్పదా..? ఒంగోలు లోక్ సభ స్థానానికి పరిశీలన ..!

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju