Ranbir Kapoor: 2023 లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలలో ” యానిమల్ ” మూవీ కూడా ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందని చెప్పవచ్చు. భారీ అంచనాలతో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ ని దక్కించుకుంది ఈ మూవీ.
ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కి కూడా మంచి గుర్తింపు దక్కింది. ఈ కోవా కి చెందినదే తృప్తి డిమ్రి కూడా. ఈ ముద్దుగుమ్మ రణబీర్ తో రొమాన్స్ చేసి భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 900 కోట్లు కలెక్ట్ చేసి ఈ మూవీ పెద్ద సెన్సేషనల్ సృష్టించింది.
ఇక ప్రస్తుతం కూడా ఓటీటీలో సందడి చేస్తుంది యానిమల్ మూవీ. ఇక ఈ నేపథ్యంలోనే థియేటర్లలో మిస్ చేసిన కొన్ని సీన్స్ ని ఓటీటీలో ట్రెండ్ చేసేందుకు పలువురు చూశారు. కానీ సెన్సార్ ఫొటోస్ తో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ మూవీలో నాన్న సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా మొత్తంలో నాన్న అనే పదం ఎన్నిసార్లు పలికారు అనే దానిని కౌంట్ చేశారు ట్రోలర్స్. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తంగా ఈ సినిమాలో రణబీర్ తన తండ్రిని ఏకంగా 196 సార్లు పప్పా అని పిలిచాడు. ఇక ఈ వీడియోను చూసిన పలువురు ప్రేక్షకులు..” హ్యాట్సాఫ్ బ్రో.. ఆ ఒక్క మాటని అంత హైలెట్ చేయడం చాలా గ్రేట్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.