NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరో సారి నోటీసులు జారీ చేసిన స్పీకర్

YSRCP: అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ..వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరో సారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హజరు కావాలని మరో సారి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్ తమ్మినేని.

ఈ సారి వాళ్ల నుండి పూర్తి స్థాయి వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అధికార వైసీపీ నుండి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు టీడీపీకి ఫిర్యాయించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరికి స్పీకర్ మరో సారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన విచారణకు హజరుకావాలని ఆదేశించారు.

మరో పక్క రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ నెల 15వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఈ పోలింగ్ లోపుగా వీరిపై అనర్హత వేటు పడితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును కోల్పోతారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తమపై అనర్హత పిటిషన్ వేశారని వీరు పేర్కొంటున్నారు.

ఇప్పటికే వైసీపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,  పాయకరావుపేట ఎమ్మెల్యే గోళ్ల బాబూరావు,  రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త మేడా రఘునాథ రెడ్డి లు వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులుగా ఈ నెల 12వ తేదీ న నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. క్రాస్ ఓటింగ్ జరగకుంటే అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ముగ్గురు వైసీపీ అభ్యర్ధులు విజయం ఖాయమే. అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధిని పోటీకి నిలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Telangana Assembly: తొలి సారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో నేడు అసెంబ్లీకి కేసిఆర్ .. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju