12th Fail: ఓటీటీ హవా రోజు రోజుకి పెరిగిపోతుంది. సినిమా ధియేటర్లను మించి ఓటీటీలో బిజినెస్ జరుగుతుంది. దీంతో చాలామంది స్టార్ హీరోలు ఓటిటి ఆధారం చేసుకుని ప్రాజెక్టులు చేస్తున్నారు. ఒకప్పుడు ఓటిటి అంటే చిన్న సినిమాలకు చిన్న హీరోలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కి ఓటీటీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీ..ఓటిటిలో బాగా సందడి చేస్తున్నాయి. ఈ రకంగానే ఇటీవల బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా థియేటర్లో మాత్రమే కాదు ఓటీటీలో కూడా రికార్డులు వర్షం కురిపించింది.
20 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 రోజుల్లోనే 66.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. నటుడు విక్రాంత్ మాసే… మనోజ్ కుమార్ శర్మగా నటించాడు. 12వ తరగతి ఫెయిల్ అయినా మనోజ్ కుమార్ ఆ తర్వాత ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్ లేనప్పటికీ మౌత్ పబ్లిసిటీ ద్వారా సూపర్ హిట్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో 600 స్క్రీన్ లలో మాత్రమే విడుదల చేయడంతో చాలామంది ఈ సినిమా.. థియేటర్ లో చూడలేకపోయారు. దీంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావడంతో విడుదలైన కాసేపటికే చూసేందుకు మిలియన్ల మంది పోటెత్తారు. ఈ ప్లాట్ ఫామ్ లో విడుదలైన మూడు రోజుల్లోనే వేడాది రికార్డులు మొత్తాన్ని డిస్నీ హాట్ స్టార్ కొల్లగొట్టింది. ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనత సొంతం చేసుకోవడం జరిగింది.
విషయంలోకి వెళ్తే ఐఎండిబి తాజాగా విడుదల చేసిన 250 బెస్ట్ ఫిలిమ్స్ లిస్టులో ఈ సినిమా 50వ స్థానంలో నిలిచింది. దీంతో ఈ జాబితాలో టాప్ 50 లో నిలిచిన ఏకైక భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ ఘనతతో ఐఎండిబిలో అత్యధిక రేటింగ్(9.2) పొందిన రికార్డు కూడా ఈ మూవీ పేరు మీదే ఉంది. ఈ సినిమా చూసి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ సినిమాకు పూర్తి అయిన రియల్ 12th ఫెయిల్ జంటను కలిశారు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ ఆయన సతీమణి ఐఆర్ఎస్ అధికారిని శ్రద్ధ జోషితో కలిసి లంచ్ చేయటం కూడా జరిగింది. ఇదే సమయంలో ఆ జంట దగ్గర ఆటోగ్రాఫ్ కూడా ఆనంద్ మహీంద్ర తీసుకోవడం జరిగింది.