NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

Chandrababu: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. సిద్ధం సభల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహనరెడ్డి .. చంద్రబాబు, విపక్షాలపైనా, గత చంద్రబాబు పాలనపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తుండగా, రా..కదలిరా .. సభల్లో జగన్మోహనరెడ్డి పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

రాప్తాడు సభల్లో జగన్ పంచ్ డైలాగ్ లు వేశారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ చంద్రబాబు ఇవేళ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఓపెన్ ఛాలంజ్ అంటూ సవాల్ విసిరారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని అన్నారు.

జగన్ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు చంద్రబాబు. అభివృద్ధి పాలన ఎవరిదో..విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి….బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి….విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేశారని చంద్రబాబు దయ్యబట్టారు.

ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందనీ, ఇంకా 50 రోజులే ఉన్నాయన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందని అన్నారు.

‘బూటకపు ప్రసంగాలు కాదు…అభివృద్ది పాలన ఎవరిదో….విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం…నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా….దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ!’ అని చంద్రబాబు సవాల్ విసిరారు. అలానే జగన్ పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి వీడియోను చంద్రబాబు పోస్టు చేశారు.

YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి – సీఎం జగన్

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N