NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి – సీఎం జగన్

YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాల‌ని సీఎం వైయ‌స్ జగన్‌ పంచ్‌ డైలాగ్‌లు విసిరారు. అదివారం రాప్తాడులో ఎన్నికల శంఖారావం స‌భ‌లో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య త్వరలో యుద్ధం జరుగుతోందని అన్నారు.

చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదని అన్నారు. అప్పు ఎగ్గొట్టేవాడు .. పది రూపాయల వడ్డీ అయినా ఇస్తానని అంటాడనీ, అలానే మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తానని అంటాడని సెటైర్ వేశారు. ఒక్క సారి బటన్న నొట్కి ఆశీర్వదిస్తేనే 125 సార్లు బటన్ నొక్కి 2.55 లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేశానని అన్నారు. మీరు 2, 3  సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు ప్రజలకు, రాష్ట్రానికి జరుగుతుంద‌ని జగన్‌ పేర్కొన్నారు.

నేడు రాయలసీమలో జన సముద్రం కనిపిస్తోందని అన్నారు జగన్. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతున్న యుద్దమనీ, కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం.. పథకాలు కొనసాగాలని అడుగులేస్తున్న మనకు.. వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా? అంటూ పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ ప్రశ్నించారు.

ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున.. పెత్తందారులు మరోవైపున ఉన్నారన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకూ మధ్య జరుగుతున్నదీ యుద్ధం అని అన్నారు. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ వస్తున్న నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌కు… ఈ గడ్డమీదే పుట్టి.. ఈ గడ్డమీద మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని, ప్రజలమధ్యే ఉన్న మనకూ మధ్య యుద్దం జరుగుతోందన్నారు.

మరో రెండు నెలల్లో జరిగే  కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పని చేయడానికి.. ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌ తప్పుడు కథనాల నుంచి కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించారు. టీడీపీ వారి సోషల్‌ మీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మీరంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సిద్దం అంటూ ఇక్కడున్న ప్రతీ ఒక్కరూ కూడా మీ సెల్‌ఫోన్‌ తీసి టార్చ్‌ వేసి చెప్పాలన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేద ప్రజలు అన్యాయం అయిపోతారని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి చెప్పాలన్నారు. ప్రజలే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు అని జగన్  అన్నారు.

BJP: మూడో సారి గెలుపుపై అనుమానం అక్కర్లేదు – మోడీ

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju