NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ ముందే ‘ గంటా ‘ ను ఘోరంగా అవ‌మానించిన బాల‌య్య చిన్న‌ల్లుడు భ‌ర‌త్‌…!

ఎన్నికలకు ముందు విశాఖ తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్న అసమ్మ‌తి సెగలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడే వాలిపోతూ ఉంటారు. ప్రజారాజ్యం నుంచి గెలిచి ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో అక్కడ మంత్రిగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత టిడిపిలోకి జంప్ చేసి ఎక్కడ కూడా ఐదేళ్లపాటు అధికారం ఎంజాయ్ చేశారు. గత ఎన్నికలలో గంటా ఎమ్మెల్యేగా గెలిచినా తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో ఐదేళ్లు సైలెంట్ గా ఉండిపోయారు.

మధ్యలో పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పార్టీకి చెందిన ఎంతో మంది కీలక నేతలు బయటకు వచ్చి పోరాటాలు చేశారు. విశాఖ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత అయిన పాత్రుడు పార్టీ కోసం ఎంతో ఫైట్ చేసి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో కూడా గంట బయటకు వచ్చింది లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల టైంలో గంటా హడావుడి మొదలైంది. మళ్లీ ఏపీలో టిడిపి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కొట్టేసి రాజకీయం ఎంజాయ్ చేయాలన్నదే గంటా ఆలోచన. అయితే గంటా తీరును సొంత జిల్లాకే చెందిన టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారు.

తాజాగా విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ ముందే లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ గంటాపై తీవ్రవ్యఖ్యలు చేసి ఘోరంగా అవమానించినట్టు తెలుస్తోంది. నారా లోకేష్ ఉత్తర నియోజకవర్గం లోని బిర్లా జంక్షన్ వద్ద సోమవారం నిర్వహించిన శంఖారావం సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. టిడిపి విశాఖపట్నం పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న శ్రీ భ‌ర‌త్ గంటాపై ప్రత్యక్షంగానే విమర్శలు గుర్తించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీకు అందుబాటులో లేకపోయినా మేం అండగా ఉంటామని భర‌త్‌ చెప్పారు.

ప్రజల సమస్యలను తీర్చుతామంటూ వేదికపై గంటా సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో గంటా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వేదికపై ఉన్న నేతలతో పాటు కార్యకర్తలు సైతం భరత్‌ వ్యాఖ్యలపై షాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఉత్తర నియోజకవర్గంలోని టిడిపి నేతలు కార్యకర్తలు మాత్రం భర‌త్‌ చేసిన వ్యాఖ్యలలో తప్పేముందని చర్చించుకోవడం కోసమెరుపు. ఇప్పటికే నార్త్ నియోజకవర్గ పార్టీ కేడ‌ర్‌లో గంటాపై పూర్తిగా విశ్వాసం పోయింది.

మరోవైపు ఉత్తరం నియోజకవర్గ ఇన్చార్జిగా తమకు బాధ్యతలు అప్పగించాలంటూ టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఇతల‌పాక సుజాత స్వయంగా గంటాకి వినతిపత్రం అందించారు. గంటాను ఇక్క‌డ ఇన్‌చార్జ్‌గా త‌ప్పుకోవాల‌న్న‌దే క‌దా దీన‌ర్థం. ఇక ప్రతి ఎన్నికకు నియోజకవర్గ మారే గంటా ఈసారి కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి భీమిలి వైపు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందుకు లోకేష్ ఎంత మాత్రం ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా టిడిపిలో మునుపటిలా ఈసారి గంటా పప్పులు ఉడికే పరిస్థితి అయితే కనపడటం లేదు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju