NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అనితకు బిగ్ షాక్‌.. పాపం లోకేష్ చేతులెత్తేసిన‌ట్టే…!

వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ 2014 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉన్న అనితకు చివర్లో అనూహ్యంగా పాయకరావుపేట సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ రాజకీయ నేత చెంగల వెంకట్రావును స్వల్ప మెజార్టీతో ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. బలమైన వాయిస్ వినిపించడంతో పాటు వైసిపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అయితే ఐదేళ్లలో లోకల్ గా పార్టీ కేడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అనిత ఎలాగైనా అసెంబ్లీలో ఉండాలన్న పట్టుదలతో చంద్రబాబు పట్టుబట్టి ఆమెను పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయించారు.

ఆ ఎన్నికల్లో ఆమె ప్రస్తుతం హోంమంత్రి తానేటి వనిత చేతిలో ఓడిపోయారు. అనంతరం అనితకు తిరిగి పాయకరావుపేట ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఈ ఎన్నికల్లోను అనిత పాయికరావుపేట నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికలకు ముందే లోకల్ టిడిపి క్యాడర్ అనితను తీవ్రంగా వ్యతిరేకించడంతో చంద్రబాబు ఆమెను కొవ్వూరులో పోటీ చేయించారు. ఈసారి కూడా అనితకు సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని.. తాము ఆమె గెలుపు కోసం పని చేసే ప్రసక్తే లేదని సీనియర్ నేతలు కుండబద్దలు కొడుతున్నారు.

లోకేష్ అయితే అనితను ఎలాగైనా గెలిపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్థానిక టిడిపి క్యాడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అనితకు సీటు ఇస్తే జనసేన కేడర్ కూడా ఆమెకు పని చేయమని తేల్చి చెబుతున్నారు. అనితకు కాకుండా ఎవరికి సీటు ఇచ్చిన తాము పని చేస్తామని ఆమెకి ఇస్తే తామంతా వైసీపీకే ఓట్లు వేస్తామని తేల్చి చెబుతున్నారు. పైగా పాయకరావుపేటలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం ఎమ్మెల్యే కంబాల జోకులు అక్కడ ఫ్రెష్ క్యాండెట్ గా రంగంలోకి దిగుతున్నారు.

వైసిపి అభ్యర్థి పై నియోజకవర్గంలో వ్యతిరేకత కూడా లేదు. ఈ టైంలో సొంత పార్టీ క్యాడర్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న అనితకు సీటు ఇస్తే టిడిపితో పాటు జనసేన నుంచి కూడా సహకారం వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు పాయకరావుపేటలో టిడిపి అభ్యర్థిని మార్చాలా లేదా జనసేన కోరుతుండ‌డంతో వాళ్ల‌కు ఇచ్చేయాలా అన్న చ‌ర్చ‌లు టీడీపీలో జరుగుతున్నాయి. లోకేష్ అనిత‌ను ఎలాగైనా మ‌ళ్లీ అసెంబ్లీకి తీసుకురావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నా అది నెర‌వేరేలా లేదు. ఇక ప‌వ‌న్ గ‌ట్టిగా కోరుతున్న సీట్లలో పాయికరావుపేట కూడా ఉండటం విశేషం. ఏది ఏమైనా వంగలపూడి అనిత పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?