NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రాజ‌మండ్రి సిటీలో ఫ్యానా… సైకిలా… వాసు VS భ‌ర‌త్‌లో గెలుపు ఎవ‌రిదంటే…!

ఒక‌రు ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంభించారు. మ‌రొక‌రు ఇప్పుడిప్పుడే.. ప్ర‌చారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. వీరిలో ఒకరు ఎంపీ, మ‌రొక‌రు ఎమ్మెల్యే భ‌ర్త‌. సామాజిక వ‌ర్గాల వారీగా కూడా.. స‌మ ఉజ్జీలు. దీంతో ఆ నియోజ‌క‌వ‌ర్గం హాట్ కేక్‌లా మారిపోయింది. అదే.. రాజ‌మండ్రి సిటీ గ‌త ఎన్నికలకు ఇప్ప‌టికీ.. చాలా మార్పు చోటు చేసుకున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలోప్ర‌ధాన పార్టీల ప‌క్షాన అభ్య‌ర్థుల ఖ‌రారు అయిపోయింది. దీంతో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు? అనే చ‌ర్చ ఆసక్తిగా మారింది.

గెలుపు ఓట‌ములు మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇద్ద‌రూ కూడా యువ నాయ‌కులు కావ‌డం.. బ‌ల‌మైన ప‌క్షాల త‌ర‌ఫున బ‌రిలో దిగుతుండ‌డం వంటివి మాత్రం ఆసక్తిని మ‌రింత పెంచుతున్నాయి. టీడీపీ విష‌యాన్ని చూస్తే.. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసు పేరును చంద్ర‌బాబు ఖరారు చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆదిరెడ్డి వాసు ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే మొదటిసారి. వాసు భార్య ఆదిరెడ్డి భవాని ప్రస్తుత‌ ఎమ్మెల్యే. వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా…తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్‌గా పనిచేశారు.

రాజకీయ కుటుంబం కావడంతో ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు బలమైన అభ్యర్థిగా నిలుస్తున్నారనే టాక్ ఉంది. అంతేకాదు.. గ‌త ఏడాది జ‌గజ్జ‌న‌ని చిట్ ఫండ్ సంస్థ‌కు సంబంధించి న‌మోదైన కేసులో జైలుకు వెళ్లిరావ డం.. ప్ర‌జ‌ల్లో సింప‌తీని పెంచింది. అయితే.. ఎన్నిక‌ల‌కు దీనిని ఏవిధంగా వినియోగించుకుంటార‌నేది చూడాలి. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా భ‌వానీకి మంచి పేరే ఉంది. వివాదాల‌కు దూరంగా.. ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఆమె నిలిచింది. దీంతో వాసు గెలుపుపై అంచ‌నాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

ఇక‌, సిటీ వైసిపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ బరిలోకి దిగుతున్నారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన భరత్ గత ఎన్నికల్లో రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,80,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఇది.. ఆయ‌నకు పెద్ద‌బ‌లంగా మార‌నుంద‌ని పార్టీ అంచ‌నా వేస్తోంది. రాజమం డ్రి సిటీలోని బలమైన గౌడ శెట్టిబలిజ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటం భరత్ కు కలిసి వచ్చే అంశం.

భరత్ ఎంపీగా పనిచేసిన తన ఐదేళ్ల పాలనలో రాజమండ్రి సిటీ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో రాజమండ్రిలో అభివృద్ధి పనులను చేపట్టారు. మోరంపూడి ఫ్లేఓవర్, ఎయిర్ పోర్ట్ విస్తరణ పనులు, రాజమండ్రి సుందరీకరణ పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వైసిపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతికూల ఫలితాలు వస్తాయని ఆశాభవంతో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు వైసిపి ఓటమి చెందడంతో అధిష్టానం సైతం సీరియస్‌గా తీసుకుని ఈసారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంది.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?