NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రాయ‌ల‌సీమ‌లో 2019లో 3 సీట్లు గెలిచిన టీడీపీ 2024లో గెలిచే సీట్ల లెక్క ఇదే..!

రాయ‌ల‌సీమ అంటేనే అధికార వైసీపీకి ఎంత కంచుకోటో తెలిసిందే. జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌కు సీమ‌లోని నాలుగు జిల్లాలు పెట్ట‌ని కోట‌గా ఉంటూ వ‌స్తున్నాయి. సీమ‌లో క‌డ‌ప‌లో 10 – క‌ర్నూలులో 14 – అనంత‌పురంలో 14 – చిత్తూరులో 14 మొత్తం 52 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం మూడు సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. ఉర‌వ‌కొండ‌లో ప‌య్యావుల కేశ‌వ్‌, హిందూపురంలో నంద‌మూరి బాల‌కృష్ణ – కుప్పంలో చంద్ర‌బాబు మాత్ర‌మే విజ‌యం సాధించారు. అందులోనూ చంద్ర‌బాబు మెజార్టీ బాగా ప‌డిపోయింది.

ఇక ఇప్పుడు సీమ‌లోని నాలుగు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది.. ఈ సారి టీడీపీ ఆ 3 సీట్ల నుంచి ఎంత‌కు పెరుగుతుంద‌న్న‌దానిపై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల స‌ర్వేలు వ‌చ్చేశాయి. అయితే ఈ సారి వైసీపీ ప‌రిస్థితి సీమ‌లో అంత ఆశాజ‌న‌కంగా లేన‌ట్టు తెలుస్తోంది. వైసీపీ వాళ్లే ఈ విష‌యం ఓపెన్‌గా చెపుతున్నారు. ప్ర‌భుత్వ అధికారులు కూడా అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో అంగీక‌రిస్తున్నారు. ఈ సారి సీమ‌లో 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ క‌నిష్టంగా 20 నుంచి గరిష్టంగా 27 సీట్లు వ‌ర‌కు గెలిచే ప‌రిస్థితి ఉంద‌ని చెపుతున్నారు.

అనంత‌పురం జిల్లాలో 14 సీట్ల‌లో టీడీపీకి 7 -9 వ‌ర‌కు స‌లువుగానే గెలిచే ఛాన్సులు ఉన్నాయి. రాఫ్తాడు, సింగ‌న‌మ‌ల‌, హిందూపురం, ఉర‌వ‌కొండ‌, క‌దిరి, క‌ళ్యాణ‌దుర్గం, పెనుగొండ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక క‌ర్నూలు జిల్లాలో 14 సీట్ల‌లో డోన్‌, ఎమ్మిగ‌నూరు, ప‌త్తికొండ‌, బ‌న‌గాన‌ప‌ల్లె, ఆలూరు సీట్ల‌లో సైకిల్ స్వింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక క‌డ‌ప‌లోనే 10 సీట్ల‌లో 3 వ‌ర‌కు గ్యారెంటీ అని వైసీపీ శ్రేణులే చెపుతున్నాయి. క‌మ‌లాపురం, మైదుకూరు, రాజంపేట‌, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరులో మూడు వ‌ర‌కు గెలిచే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో కుప్పం, న‌గ‌రి, తిరుప‌తి, చిత్తూరు, శ్రీకాళ‌హ‌స్తి, ప‌ల‌మ‌నేరు సీట్ల‌తో పాటు మ‌రో రెండు మూడు చోట్ల టీడీపీ బ‌లంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ సారి సీమ‌లో టీడీపీ చాలా బ‌లంగా క‌నిపిస్తోంద‌న్న మాట నిజం. మ‌రి దీనిని ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీ ఇలాగే తీసుకు వెళుతుందా ? లేదా వైసీపీ ఎన్నిక‌ల వేళ త‌న మ్యాజిక్ మ‌రోసారి రిపీట్ చేస్తుందా ? అన్న‌ది ప్ర‌స్తుతానికి సస్పెన్సే అయినా సీమ‌లో గ‌త ఎన్నిక‌లంత వ‌న్ సైడ్ వేవ్ ఈ సారి లేద‌న్న‌ది ప‌క్కా నిజం.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?