NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ లీడ‌ర్ల‌లో ఎక్క‌డా లేని జోష్‌.. ఒకే ఒక్క కార‌ణం…!

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు టికెట్ల కుస్తీలో అలుపెరుగ‌ని పోరులో ఉన్న టీడీపీ నాయ‌కులు మె త్తబ‌డ్డారు. శాంతించారు. అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యానికి అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా జేజేలు ప‌లుకుతు న్నారు. వాస్త‌వానికి గ‌త నెల‌లో టీడీపీ, జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం తొలి జాబితా విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. నాయ కులు అస‌మ్మ‌తి గ‌ళం వినిపించారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలు మారుతున్నామ‌నే సంకేతాలు కూడా ఇచ్చారు. ఇలాంటి ప‌రిస్థితి పార్టీలో ఇబ్బందికి దారితీసింది.

అయితే..అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకిదిగి.. స్థాయిల‌తో సంబంధం లేకుండా.. నేత‌ల‌ను పిలిపించుకుని, వారిని భోజ‌నం పెట్టి మ‌రీ బుజ్జ‌గించారు. పార్టీ అధికారంలోకి రావాల్సిన అవ‌స రాన్ని వారికి పూస‌గుచ్చ‌న‌ట్టు వివ‌రించారు. అంతేకాదు.. ప‌లువురు నాయ‌కుల‌కు పార్టీ అధికారంలోకి వ‌స్తే.. ఎలాంటి మేలు జ‌రుగుతుందో కూడా చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ నేత‌లు కొంత‌మేర‌కు శాంతించినా.. ఇంకా అసంతృప్తులు ఉన్నాయి.

దీనిని కూడా గ‌మ‌నించిన చంద్ర‌బాబు.. నేత‌ల‌కు అంత‌ర్గ‌తంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి తాను చేయించిన స‌ర్వేల వివ‌రాల‌ను పంపించిన‌ట్టు తెలిసింది. పార్టీ క‌ల‌సి క‌ట్టుగా ఉంటే.. అధికారం మ‌నేద‌న ని.. ముందు పార్టీ అధికారంలోకి వ‌స్తే.. త‌ర్వాత ప‌ద‌వులు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న స‌వివ‌రంగా వెల్ల‌డించారు. దీనికి మెజారిటీ నాయ‌కులు సంతృప్తి చెందారు. ఇంత‌లోనే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తోనూ చంద్ర‌బాబు భేటీ అయ్యార‌న్న వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది.

స‌హ‌జంగా.. ప్ర‌శాంత్ కిషోర్ స్వ‌భావం ఏంటంటే.. ఎక్క‌డైనా.. ఏ పార్టీ అయినా గెలుస్తుంద‌ని భావిస్తేనే ఆయ‌న ఆ పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యేందుకు ప్రాధాన్య‌మిస్తారు. గ‌తంలో గోవా ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ త‌న‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని పిలిచిన‌ప్పుడు.. ముందుగా ఆయ‌న పార్టీ ప‌రిస్థితిని అంచ‌నా వేసుకున్నారు గోవాలో కాంగ్రెస్ పుంజుకునేది లేద‌ని తెలిసిన త‌ర్వాత‌.. ఆపార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏపీలో టీడీపీ గెలిచే ప‌రిస్థితి ఉంద‌ని తెలిసిన త‌ర్వాతే.. ఆయ‌న బాబుతో భేటీ అయ్యారు. ఇదే.. ఇప్పుడు టీడీపీ నేత‌ల్లో కొత్త జోష్ నింప‌డానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?