NewsOrbit
జాతీయం న్యూస్

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతి కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Supreme Court: అసెంబ్లీలోని ఎమ్మెల్యేలు, పార్లమెంట్ లోని ఎంపీలకు ..అవినీతి, లంచం కేసుల్లో విచారణ నుండి మినహాయింపు ఉండదని సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు పివీ నరసింహరావు కేసులో నిందితులపై చర్యలు తీసుకోకుండా 1998 లో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

ప్రసంగాలు, అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓటు వేసేందుకు లంచాలు తీసుకున్నారన్న అరోపణలు ఎదుర్కొంటున్న చట్ట సభ్యులకు విచారణ నుండి మినహాయింపును ఇస్తూ 1998లో సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105(2), 194(2) పార్లమెంటరీ ప్రివిలేజ్ ని పరిగణలోకి ఈ తీర్పును ఇస్తున్నట్లు నాటి ధర్మాసనం పేర్కొంది. అయితే .. ఈ తీర్పు అర్ధం లంచం తీసుకోవడం అనేది అర్టికల్ 105,194 లకు విరుద్దంగా ఉన్నాయని తాజాగా సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

Supreme Court

ఈ మేరకు నాటి తీర్పును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం వెలువరించింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ లేదు. లంచాలు తీసుకుని పార్లమెంట్, అసెంబ్లీలలో ప్రశ్నలు అడిగితే తప్పకుండా విచారణ ఎదుర్కవాల్సిందేనని ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్ట సభల్లో సభ్యులు లంచం తీసుకుని ప్రశ్నలు వేసినా ఇది వర్తిస్తుంది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తొందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.

AP High Court: ఏపీ టెట్, డీఎస్సీ షెడ్యూల్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

Related posts

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N