NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణాలో వైసీపీ యాంటీ ఓటు చీలిపోతుందా…!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని పెడ‌న నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ పోరు మామూలుగా లేదని అంటున్నారు ప‌రి శీల‌కులు. ఈ టికెట్‌ను టీడీపీ నాయ‌కుడు బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ ఆశించారు. అయితే..ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. తొలిజాబితాలోనే ఈ టికెట్‌నువేరే వారికి కేటాయించారు. కాగిత కృష్ణ ప్ర‌సాద్‌కు ఇచ్చారు. దీంతో ఒక్క‌సారిగా కుంగిపోయిన వేద‌వ్యాస్ ఆ రోజే ఆసుప‌త్రి పాల‌య్యారు. ఇదిలావుంటే.. రోజులు గ‌డిచినా వ్యాస్‌కు పార్టీ నుంచి పిలుపు రాలేదు.

ఇత‌ర నేత‌ల మాదిరిగా..త‌న‌ను కూడా పిలుస్తార‌ని, బుజ్జ‌గిస్తార‌ని వ్యాస్ అనుకున్నారు. అయితే.. చంద్ర బాబు లైట్ తీసుకున్నారు. దీంతో ఇప్పుడు వ్యాస్ ర‌గిలిపోతున్నారు. తాజాగా ఆయన త‌న నివాసంలో జ‌న‌సేన నాయ‌కుల‌తో ర‌హ‌స్యంగా భేటీ నిర్వ‌హించారు. ఏం చేయాల‌న్న దానిపై వారితో చ‌ర్చించారు. ఇక్క‌డ వాస్త‌వానికి జ‌న‌సేన నేత‌లు కూడా టికెట్ ఆశించారు. వారికి కూడా ద‌క్క‌లేదు. దీంతో వారంతా వ్యాస్‌కు జై కొడుతున్నారు.

తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై వ్యాస్‌వారితో చ‌ర్చ‌లు జ‌రిపారు. రెండు కీల‌క విష‌యంపై దృష్టి పెట్టారు. ఒక‌టి.. ఆయ‌న వైసీపీలో చేర‌డం. ఇది జ‌రిగినా.. టికెట్ ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కం లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. మెజారిటీ నాయ‌కులు వైసీపీలోకి వెళ్లాల‌ని సూచించిన‌ట్టు తెలిసింది. అ యితే..జ‌న‌సేన నాయ‌కులు, వ్యాస్ అనుచ‌రులు మాత్రం వైసీపీ అయితే..వ ద్ద‌ని సూచించిన‌ట్టు స‌మాచా రం. అలాకాకుండా.. ఇక్క‌డ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల‌న్న‌ది వారి సూచ‌న‌.

ఈ దిశ‌గానే..వ్యాస్ కూడా స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. ప్రాథ‌మికంగా అయితే.. మ‌రో రెండు రోజుల పాటు టీడీపీ నుంచి ఎలాంటిస‌మాచార‌మైనా వ‌స్తుందేమోన‌ని ఎదురు చూడాల‌ని నిర్ణ‌యించారు. అలా రాని ప‌క్షంలో అప్పుడు మ‌రోసారి నాయ‌కుల‌తో భేటీ అయి.. ఇండిపెండెంట్‌గానే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించు కునే దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. వైసీపీ వ్య‌తిరేక ఓటు చీలిపోయే ప్ర‌మాదం ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju