NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: పార్టీల పొత్తులతో చంద్రబాబు .. ప్రజాబలంతో మనం – వైఎస్ జగన్

YSRCP: పార్టీల పొత్తులతో చంద్రబాబు ఉంటే .. ప్రజాబలంతో మనం తలబడుతున్నామని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించిన సీఎం వైఎస్ జగన్ సిద్దం అనే నినాదంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించి క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేస్తున్నారు. ఒకదానికి మించి మరొక సభలు విజయవంతం అయ్యాయి.

ఇవేళ బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో నిర్వహించిన సిద్దం సభ మూడు సభలకు మించి సూపర్ సక్సెస్ అయ్యింది. లక్షలాది మంది వైసీపీ కార్యకర్తలు సభకు హజరవ్వగా, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ సభలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ పై సెటైర్ లు వేశారు. చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలతో పాటు జేబులో మరో జాతీయ పార్టీ ఉందని, వీరంతా జగన్ ను ఓడించాలని చూస్తున్నారని, తాను మాత్రం పేదలను గెలిపించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు.

చంద్రబాబుకు ఇతర పార్టీల్లో స్టార్ క్యాంపెయినర్లు, అబద్దాలకు రంగులు పూసే ఎల్లో మీడియా ఉంటే తనకు మాత్రం లబ్దిదారులు, వారి కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారన్నారు. ప్యాకేజీలు ఇచ్చి కొనుకున్న ప్యాకేజీ స్టార్ తన పార్టీ వారి కోసం సీటు కావాలని అడగడనీ, చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. సైకిల్ తోయమంటే తోస్తాడు, కావాలంటే తాను తాగే టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సెటైర్ వేశారు. టీడీపీ మేనిఫెస్టోను కిచిడీ మానిఫెస్టోగా అభివర్ణించారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ వాగ్దానాలను చంద్రబాబు కాపీ కొట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడని విమర్శించారు.

2014లో ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత బుట్టదాఖలు చేసిన చంద్రబాబు  మరో సారి ప్రజలను మోసం చేసేందుకు మరో మేనిఫెస్టో తయారు చేస్తున్నారని విమర్శించారు జగన్. 2014లో ఇదే మూడు పార్టీలు కూటమిగా వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ను సీఎం జగన్ చదివి  వినిపించి ఇందులో హామీలు అమలు అయ్యాయా అని ప్రశ్నించారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని అన్నారు. చంద్రబాబు అండ్ కో పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదని అన్నారు. నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని పార్టీ అటు వైపు ఉందని, వాళ్ల వెనుక ప్రజలు లేరు కాబట్టే పొత్తులతో ఎత్తులతో వస్తున్నారని విమర్శించారు.

ప్రజలను దోచుకునేందుకు.. పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకు అధికారం కావాలని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని సగర్వంగా చెబుతున్నామన్నారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్దం ఇది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని  ప్రజలకు వివరించి మరో సారి పార్టీ ఘన విజయం సాధించేలా క్యాడర్ పని చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. వైసీపీ అంచనాలకు అనుగుణంగా లక్షలాది మంది సభకు హజరుకావడంతో పార్టీ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Australia: ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ దారుణ హత్య

Related posts

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!