NewsOrbit
జాతీయం న్యూస్

Breaking: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా.. కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

Breaking: హర్యానా సీఎం మనోహర్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మనోహర్ లాల్ తో పాటు మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. సిఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం బీజేపీ శాసనసభాపక్షంతో సమావేశమైయ్యారు. అనంతరం గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి రాజీనామాను సమర్పించారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. అలానే డిప్యూటి సీఎం దుష్యంత్ చౌతాలా కూడా రాజీనామా అందజేశారు.

హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో ఏకాభిప్రాం కుదరలేదని సమాచారం. దీంతో జేజేపీతో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం సమిష్టిగా రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.

bjp

ఈ మేరకు.. సీఎం మనోహర్ లాల్ అధికార బీజేపీ ఎమ్మెల్యేలతో  పాటు ప్రభుత్వానికి మద్దతు కోరుతూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తొంది. స్వతంత్ర ఎమ్మెల్యేలతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటునకు బీజేపీ కసరత్తు చేసింది. 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41, జేజేపీకి 10, కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో పాటు ఒక హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు ఉంది. ఈ లెక్కన జేజేపీ మద్దతు లేకపోయినా కూడా బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని సమాచారం.

తమకు ఉన్న పది మంది ఎమ్మెల్యేల్లో అయిదుగురు ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుందని జేజేపీ నేత ఆరోపిస్తున్నారు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదు. కాకపోతే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ముఖ్య మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓబీసీకి చెందిన నేత కాగా ఆయన స్థానంలో ఝాట్ నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు గానూ బీజేపీ హైకమాండ్ ముగ్గురు అబ్జర్వర్ లను హర్యనాకు పంపింది. వీరి ఆధ్వర్యంలో బీజేపీ ఎల్పీ సమావేశం నిర్వహించి కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు.

Janasena: జనసేనకు తగ్గిన సీట్లు .. పవన్ ఇచ్చిన క్లారిటీ ఇది

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?