NewsOrbit
న్యూస్

BRS MLC Kavitha: ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు .. మధ్యంతర బయిల్ పై ఏప్రిల్ 1న విచారణ

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్  కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిందితురాలిగా ఉండి అరెస్టు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మరో వైపు కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో కవితను ఈడీ అధికారులు కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చారు.

MLC Kavita

కవితను మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును అభ్యర్ధించారు. కేసు విచారణ పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కాగా, కవిత కేసులో ఇరువైపులా వాదనలు ముగిశాయి. కుమారుడు పరీక్షల నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 16వ తేదీ వరకూ పరీక్షలు ఉన్న నేపథ్యంలో కవిత తరపు న్యాయవాది మధ్యంతర బెయిల్ కోరారు.

ఇరువైపులా వాదనలు ముగియడంతో కొద్దిసేపటి తర్వాత న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 9 వరకూ (14 రోజులు)  జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. కాగా, మద్యంతర బెయిల్ పై విచారణను న్యాయస్థానం  ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్సీ కవిత కోర్టు లోపలికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు.

తాత్కాలికంగా జైలుకు పంపవచ్చని కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో జాయిన్ అయ్యారనీ, మరొకరు టికెట్ ఆశిస్తున్నారన్నారు. థర్డ్ ముద్దాయి ఎలక్టోరల్ రూపంలో రూ.50 కోట్లు ఇచ్చారన్నారు. ఇది ఫ్యాబ్రికేటెడ్, ఫాల్స్ కేసు అని కవిత వెల్లడించారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదనీ.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని తెలిపారు.

Arvind Kejriwal: ఢిల్లీలో ఆరోగ్య సమస్యలను పరిష్కరించండి .. కస్టడీ నుండి రెండో ఆదేశాలు ఇచ్చిన సీఎం కేజ్రీవాల్..!

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju