NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మిథున్‌రెడ్డి సెగ మొద‌లైంది.. రాజంపేట రాజ‌కీయాన్ని ఒక్క‌సారిగా మార్చింది ఎవ‌రు…?

రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం అంటే.. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబానికి కొట్టిన పిండి. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కుమారుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అయితే.. గ‌త రెండు సార్లు కూడా.. ఇక్క‌డ మిథున్‌రెడ్డిపై పోటీ చేసిన వారిని గ‌మ‌నిస్తే.. ఒక‌రు స్థానికేత‌రులు. మ‌రొక‌రు పెద్ద‌గా బ‌లం ఉన్న నాయ‌కులు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 2014 ఎన్నిక‌ల్లో రాజంపేట నుంచి ప్ర‌స్తుతం బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి పోటీ చేశారు. ఆమె స్థానికేత‌రురాలు. దీంతో మిథున్‌రెడ్డి విజ‌యం సాధించారు.

Mithun Reddy Sega has started.. Who changed Rajampet politics once and for all...?
Mithun Reddy Sega has started.. Who changed Rajampet politics once and for all…?

ఇక‌, 2019లో టీడీపీత‌ర‌ఫున ఇక్క‌డ నుంచి డీకే స‌త్య ప్ర‌భ పోటీ చేశారు. అయితే.. ఆమెను ఔట్ డేటెడ్ నాయ‌కురాలిగా ప్రొజెక్టు చేయ‌డం పెద్దిరెడ్డి వ‌ర్గం స‌క్సెస్ అయింది. దీంతో మిథున్‌రెడ్డి రెండు సార్లు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు ఆయ‌న మూడోసారి పోటీ చేస్తున్నారు. అయితే.. ఈ సారి స‌మ ఉజ్జీతో పాటు.. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డికావ‌డం గ‌మ‌నార్హం. పార్టీఏదైనా.. ఆయ‌న‌కు సొంత హ‌వా ఇక్క‌డ ఉంది. కిర‌ణ్ అంటే.. పార్టీల‌కు అతీతంగా నాయ‌కు లు ఇష్ట‌ప‌డ‌తారు. అంతేకాదు.. రైతులు, పారిశ్రామిక వ‌ర్గాల్లోనూ కిర‌ణ్‌కు మంచి పేరే ఉంది. దీంతో మిథున్ రెడ్డి గెలుపు అంత ఈజీకాదు.

ఇక్క‌డ మరో విష‌యం చెప్పాలి. మిథున్ రెడ్డి టెక్నిక‌ల్‌గా రాజంపేట‌నుంచి పోటీ చేస్తున్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న‌కు పిఠాపురం బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. `నువ్వు ఏం చేసినా.. పిఠాపురంలో ప‌వ‌న్‌ను ఓడించాలి` అని సీఎం జ‌గ‌న్ ఆదేశించ డంతో మిధున్‌రెడ్డి పిఠాపురంపైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టారు. దీంతో రాజంపేట‌పై పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేదు. ఇంకోవైపు కిర‌ణ్ కుమార్‌రెడ్డి త‌న‌కు బీజేపీ రాజంపేట టికెట్‌ను ప్ర‌క‌టించిన రెండో రోజే ఇక్కడ వాలిపోయారు. లోక‌ల్ నాయ‌కుల‌ను క‌లుస్తున్నా రు. రైతుల‌తో మ‌మేకం అవుతున్నారు. మీడియా మీటింగులు పెడుతున్నారు.

Mithun Reddy Sega has started.. Who changed Rajampet politics once and for all...?
Mithun Reddy Sega has started.. Who changed Rajampet politics once and for all…?

అంతేకాదు.. పెద్దిరెడ్డి కుటుంబంపైనా కిర‌ణ్‌కుమార్ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో రాజంపేట లోక్ సభ స్థానంలో ఈసారి ఎన్నికల వేడి మామూలుగా ఉండబోదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగడంతో వాతావరణం వేడెక్కింది. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్క‌డే తిష్ఠ వేయ‌డం.. నాయ‌కుల‌ను ముందుకు క‌దిలించ‌డం.. నేనున్నానంటూ.. రైతుల గురించి మాట్లాడ‌డం వంటివి రాజంపేట రాజ‌కీయాల‌ను వేడెక్కించాయ‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక్క‌డ క‌నుక మిథున్‌రెడ్డి ఓడితే.. వైసీపీపై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది.

Related posts

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju