NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

Sreeleela: ఒకప్పుడు ఐటెం సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. కానీ గత దశాబ్దం నుంచి హీరోయిన్లే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. అగ్రస్థానంలో ఉన్న నటీమణులు కూడా ఇతర హీరోల చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు ఓ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు దళపతి విజయ్. ఈయ‌న ప్ర‌స్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(ది GOAT) అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌త ఏడాది నాగ చైత‌న్య‌తో క‌స్ట‌డీ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వెంకట్ ప్రభునే గోట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయ‌న అల‌రించ‌బోబోతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, వైభవ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా..యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై కల్పతి ఎస్‌. అఘోరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్ క‌లిసి గోట్ మూవీని నిర్మిస్తున్నారు.

2024 సెప్టెంబ‌ర్ 5న గోట్ మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇటీవ‌ల రాజ‌కీయాల్లో రంగ ప్ర‌వేశం చేసిన విజ‌య్ కు గోట్ సినిమాతో న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్ట‌నున్నాడ‌ని కోలీవుడ్ లో బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా గోట్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ చిత్రంలో డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు ఓ స్పెష‌ల్ సాంగ్ ను ప్లాన్ చేశార‌ట‌.

ఆ సాంగ్ లో త్రిష మెర‌వ‌నుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్పుడా ప్ర‌త్యేక పాట కోసం గోట్ మేక‌ర్స్ టాలీవుడ్ యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌ను సంప్ర‌దిస్తున్నార‌ట‌. శ్రీ‌లీల ఎంత గొప్ప డ్యాన్స‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె డ్యాన్సింగ్ టాలెంట్ ను ఇప్ప‌టికే చాలా మంది డైరెక్ట‌ర్స్ వాడుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ మూవీలో స్పెష‌ల్ సాంగ్ కోసం శ్రీ‌లీల‌ను ఎంపిక చేసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు భావిస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఈ ఆఫ‌ర్ ను శ్రీ‌లీల అంగీక‌రిస్తే ఆమె ద‌శ తిరిగిన‌ట్లే అవుతుంది.

విజ‌య్ గోట్ మూవీ ద్వారా శ్రీ‌లీల‌కు కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ల‌భిస్తుంది. త‌మిళంలో మ‌రిన్ని సినిమా ఛాన్సులు రావ‌డం ప్రారంభం అవుతాయి. కాగా, గుంటూరు కారం మూవీతో ఈ ఏడాదిని ప్రారంభించిన శ్రీ‌లీల.. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జోడీగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో న‌టిస్తోంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం గ‌త ఏడాది సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ప‌వ‌న్ పాలిటిక్స్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగ‌డం లేదు.

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar