NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ముగ్గురు ఐఏఎస్ లకు రంగు పడుద్ది…!

నాలుగు వారాల్లో రంగులు మార్చాలి…! సాధ్యమేనా…?

పార్టీకి సంబంధం లేని రంగులు వేయాలి…! అయ్యే పనేనా…?

కోర్టు ధిక్కారణ చిక్కులు మళ్ళీ రాకూడదు…! కుదిరే తతంగమేనా…?

అన్నిటికీ మించి రంగుల ఖర్చులు మాత్రం తిరిగి అడగకూడదు…! పైవన్నీ అయ్యినా, అవ్వకపోయిన ఈ ఒక్క ప్రశ్న మాత్రం ఇప్పుడు ఆ అధికారులను వణికిస్తున్న ప్రశ్న..!

ప్రభుత్వ/ పంచాయితీ కార్యాలయాలకు నాలుగు వారాలలో వేసిన రంగులు మార్చకుంటే.. కోర్టు దిక్కారం కింద పరిగణిస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రెండు రోజులు గడిచింది. అక్కడక్కడా రంగుల తీసివేత, కొత్త రంగుల కూడికలు జరుగుతున్నాయి. మొత్తం ఈ వ్యవహారంలో ప్రభుత్వంలో కీలక బాధితులుగా మారేది ముగ్గురు ఐఏఎస్ అధికారులే…! నిజానికి ఇది రాజకీయ నిర్ణయమే.., పూర్తిగా ఒరిగేది రాజకీయ ప్రయోజనమే… అయినప్పటికీ ఇక్కడ ఏమైనా తేడా వస్తే కోర్టులో బుక్కయ్యేది మాత్రం అధికారులే. సదా సీదా అధికారులు కాదు, కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులే…!!

ముగ్గురిలో గుబులు మొదలు…!

ప్రస్తుతం ఏపీలో ఉన్న ముగ్గురు ఐఎఎస్‍ అదికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వేసిన రంగులను తుడిపి వేయాలంటే ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలి.. సిఎం జగన్‍ తన మనసులో ఉన్న విషయం బయట పెట్టడం లేదు. ఏ రాంగో చెప్పడం లేదు. తెలుపు రంగు వేసేద్దామంటే అంగీకారించడం లేదు. పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి.., కానీ అక్కడక్కడా మాత్రం తెలుపు వేసేస్తున్నారు. ఒకవేళ సీఎం జగన్ ఏదో రంగు చెప్పి… ఆ రంగు నిర్ణయాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. మళ్ళీ ఐఎఎస్‍ అధికారులే బాధ్యులవుతారు. ఈ విషయం అధికారులకు తెలిసినా.. కోర్టుకు అసలు విషయం చెప్పరు. అందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, పంచాయితీ రాజ్‍ శాఖాదిపతి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయితీ రాజ్‍శాఖ కమీషనర్‍ గిరిజా శంకర్‍లు తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. వీరికే ఇప్పుడు గుబులుగా ఉంది.

ఖర్చులు భరించాలని పిటిషన్ వేస్తె…!

ఇప్పుడు వైసిపి పై కోర్టు కత్తులు వేలాడుతున్నాయి. పిటిషన్లు మీద పిటిషన్లు పడుతున్నాయి. ఎలాగూ రంగుల కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఉన్నాయి. పనిలో పనిగా ఇదే వేడిలో రంగుల కోసం మొదటి సారి రూ. 700 కోర్టులు… మళ్ళీ రెండో సరి మరో రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు రంగులను మార్చాలంటే మరో రూ. 800 నుండి వేయి కోట్లు తప్పనిసరిగా వేయాలి. అది మొత్తం ప్రజా ధనమే.., అసలే లోటు ఉన్న ప్రభుత్వ ఖజానా నుండి ఈ వృథా ఖర్చులు ఎందుకనీ…! ఒకవేళ ఇదే సమయంలో రంగుల ఖర్చులు తిరిగి రాబట్టాలని ఒక పిటిషన్ పడేస్తే ఇబ్బంది తప్పదు. రంగులకు అంగీకరించిన, ఆమోదించిన, జీవోలు ఇచ్చిన అధికారులకు చుట్టుకుంటుంది. ఇప్పుడు వారికి అదే సమస్య.

* మరో వైపు నాలుగు వారాలలో అప్పుడే కొన్ని రోజులు గడిచాయి. నాలుగు వారాల్లోపు వేసిన రంగులు తుడిపివేయకుంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, పంచాయితీ కార్యదర్శి జికె.ద్వివేది, కమీషనర్‍ గిరిజా శంకర్‍లను కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. దానికి వీరే బాధ్యులవుతారు. లేకుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో కోర్టు వేసే శిక్షను బట్టి తెలుస్తుంది. అది ఎలాంటి శిక్ష అనేది ఊహించటం కష్టం. అధికారులు కోర్టులో కౌంటర్‍ దాఖలు చేసినప్పుడు సంబందించిన ఫైలు కాపీలను కూడా పొందు పరిచినట్లయితే పరిస్థితి మరోలా ఉండేది.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !