NewsOrbit
రాజ‌కీయాలు

రోజాకు మంత్రి పదవి దాదాపు ఖాయమయ్యే టైంలో అడ్డుకున్నది ఎవరో తెలుసా?

త్వరలో ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ నిప్రక్షాళన చేసే సూచనలు గోచరిస్తున్నాయి ఈనెల 18వ తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకట రమణలు పెద్దల సభకు వెళ్లనున్నారు.

ఈ కారణంగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులతోపాటు పనితీరు సరిగ్గా లేని వివాదాస్పద లైన మరికొందరిని కూడా తప్పించి స్వల్పంగా తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించాలని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.దీంతో ఆశావహులు చాలామంది మంత్రి పదవులు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు .ఈ రేసులో నగరి శాసనసభ్యురాలు ఏపీఐఐసీ చైర్మన్ రోజా ముందంజలో ఉన్నారంటున్నారు.జగన్ తొలి కేబినెట్లోనే రోజాకు స్థానం లభించాల్సి ఉన్నప్పటికీ కుల సమీకరణాల వల్ల అది సాధ్యపడలేదు.అయితే అందుకు నొచ్చుకున్న రోజాను ఏపీఐఐసీ చైర్మన్ పదవిచ్చి జగన్ బుజ్జగించారు.కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని జగన్ రోజా గంపెడాశతో ఉన్నారు.తన ట్రాక్ రికార్డు,పార్టీకి చేసిన సేవలు, టిడిపిపై చేసిన యుద్ధం తదితర అంశాలను జగన్ పరిగణనలోకి తీసుకుని తనకు మంత్రి పదవి ఇస్తారన్నది రోజా అంచనా.అయితే రోజాకు రాయలసీమకే చెందిన ఇద్దరు మంత్రులు అడ్డుపడుతున్నారని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.రోజా గనుక మంత్రి అయితే ఆమె ఎదగడంతో పాటు తమకిక రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయం వారిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది
అందువల్ల ఆ ఇద్దరు మంత్రులు రోజాకు మంత్రి పదవి రాకుండా అడ్డుచక్రాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారని వైసీపీ వర్గాలు చెప్పాయి.రోజా కల ఈసారైనా సాకారం అవుతుందో లేదో వేచి చూద్దాం



Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!