NewsOrbit
న్యూస్

జగన్ అర్జెంటుగా ఆ నిర్ణయం తీసుకోకపోతే సొంత కార్యకర్తలే సీరియస్ అవుతారు!

“పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేయాల్సిందే..” అని ప్రతిపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నినదించిన సంగతి తెలిసిందే. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను పసుపుకండువాలు కప్పి పార్టీలోకి చేర్చేసుకున్నారు. అదేంటి అది రాజ్యాంగ విరుద్ధం.. ప్రజాభిప్రాయాన్ని హేళన చేయడం అని చాలా మంది చెప్పినా… “నవ్వి పోదురుగాక నాకేటి…” అన్నట్లుగా ప్రవర్తించారు అన్న విమర్శను బాబు మూటగట్టుకున్నారు. వారిలో నలుగురిని మంత్రులను కూడా చేసేశారు.. ఇది పరాకాష్ట అన్న మాటలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలు వైకాపాలో చేరకపోయినా.. పసుపు కండువాలు మాత్రం తీసి పారేస్తున్నారు! దీనిపై జగన్ ఎలా స్పందించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జనసేన కు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యే… రాపాక వరప్రసాద్.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అంటే ఆయనే ఠపీమని చెప్పలేని పరిస్థితి! అంతలా నియోజకవర్గంలోనూ, అసెంబ్లీలోనూ జనసేనకు దూరమైపోయారు… కాదు కాదు వైకాపాకు దగ్గరైపోయారు! ఇక ప్రస్తుతానికి ముగ్గురు… టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి అనధికారిక విడాకులిచ్చి జగన్ తో అనధికారిక సంసారం చేస్తున్నారు. వారు టీడీపీలో లేరా అంటే… ఎందుకు లేరు, ఆ పార్టీకి రాజినామా చేయలేదు, ఆ పార్టీ సస్పెండూ చేయలేదు!! మరి వైకాపాలో ఉన్నారా అంటే… లేదు! వారు వైకాపా కండువా కప్పుకోలేదు.. జగన్ అలాంటి పని చేయలేదు!

మరి ఇప్పుడు ఆ టీడీపీ ఎమ్మెల్యేలు ఏపార్టీకి చెందినవారి కింద లెక్క? ఈ విషయంలో, ఇలాంటి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు పి.హెచ్.డి. చేశారనే విమర్శ ఉంది కాబట్టి ఆయనే చెప్పాలి! బాబు ఈ విషయంలో మరీ గట్టిగా మాట్లాదామనుకుంటే… గతం అంత దారుణంగా ఉంది… నీవు నేర్పిన విద్యయే కదా అంటారేమో అని భయంగా ఉంది!! అయితే ఈ విషయంలో మాత్రం కొందరు వైకాపా కార్యకర్తలు జగన్ కు ఒక సూచన చేస్తున్నారట!

ఈ ముసుగులో గుద్దులాట్లు, జంపింగ్ రాజకీయాలు వైకాపాకు సూటుకావు, అది పార్టీ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం కాబట్టి… వీలైనంత తొందర్లో ఎవరెవరితే టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యాన్ కిందకు రావడానికి ముచ్చటపడుతున్నారో, బాబుతో కలిసి ప్రయాణించడానికి చిరాకు పడుతున్నారో వారితో రాజినామాలు చేయించేసి… ఫ్యాన్ సింబల్ పై గెలిపించేసుకుంటే ఒకపని అయిపోతుంది అని సూచనలు చేస్తున్నారంట. మరి జగన్ వారి మాటలు విని… ఈ టీడీపీ అసంతృప్త నేతలను అధికారికంగా, అఫీషియల్ గా వైకాపా ఎమ్మెల్యేలను చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి!

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N