NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ :జనసేన పార్టీ నుంచి రాపాక సస్పెన్షన్ ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ,జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూంటే ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే వైసిపి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు.జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేశారు.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతరుల ఓట్లు అవసరం లేదు. వారు ఓటు వేయమని అడిగి ఉండరు కూడా. అయినా రాపాక వరప్రసాదరావు వైసీపీ అభ్యర్థికి ఓటు వేసి జనసేన ఇజ్జత్‌ను తీసేశారు.దీన్ని తీవ్రంగా పరిగణించిన జనసేన అధినేత పవన్ ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి.


ఒకప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. 300 ఓట్లు తెచ్చుకున్న రాపాక వరప్రసాద్‌ను తర్వాత ఏ పార్టీ కూడా దగ్గరకు తీయలేదు. లక్కీగా.. పవన్ కల్యాణ్ దగ్గరకు రావడంతో ఆయనకి రాజోలు టిక్కెట్ కేటాయించారు. అనూహ్యంగా.. ఆయన ఒక్కరే గెలిచారు. ఇండిపెండెంట్‌గా ఆయన కువందల్లో రాని ఓట్లు జనసేన అభ్యర్థిగా మాత్రం గెలుపొందేలా వచ్చాయి. అయితే.. పవన్ కల్యాణ్ కూడా గెలవలేదు..తాను గెలిచాను కాబట్టి.. తాను పవన్ కల్యాణ్ కంటే గొప్ప అనుకునే ఫీలింగ్ లోకి వెళ్లిపోయిన ఆయన.. తర్వాత పవన్ పైనే విమర్శలు ప్రారంభించారు. మొదట్లో.. జనసేనకు కాస్త ఫేవర్‌గానే ఉన్నా… రెండు కేసులు నమోదయ్యే సరికి ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కాపాడుకోలేక జనసేన నాయకత్వం చేతులెత్తేసింది. ఆయన ఉంటే ఉన్నాడు.. లేకపోతే లేదన్నట్లుగా పవన్ కల్యాణ్ కూడా లైట్ తీసుకున్నారు.

అందుకే.. అసెంబ్లీలో ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. పవన్ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా తీసుకుని రాపాక వరప్రసాద్.. పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. వైసీపీకి అవసరం ఉన్నప్పుడు మాట సాయమో,ఓటు సాయమో చేస్తే సరే అనుకోవచ్చు.. అవసరం లేకపోయినా వెళ్లి.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసి వచ్చిన రాపాక లాంటి వారిని చూసి పవన్ కల్యాణ్ గుణపాఠం నేర్చుకోవాల్సిన తరుణమిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju