NewsOrbit
న్యూస్

కెసిఆర్ సారూ ! మీకు ఈ పాయింట్ అర్థం అవ్వట్లేదు ఎందుకో !

వారం రోజుల్లో దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా రైతులకు ఓ తీపి కబురు చెబుతా చెబుతానని ఊరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటిదాకా ఆ ఊసే ఎత్తడం లేదు.దీంతో అన్ని వర్గాలు నిరాశగా ఉన్నాయి.మే 29వ తేదీన మర్కూక్ సమీపంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ మాట్లాడుతూ అతి త్వరలో ఒక తీపి కబురు చెబుతానని ప్రకటించారు.

 

కానీఎలాంటి తీపి కబురు ఇప్పటివరకు కేసీఆర్ నోటి నుంచి రాకపోవడంతో వారమన్నాడు.. నెల అయితాంది ఆ తీపి కబురు ఎప్పుడు అంటూ రైతులతో పాటు ప్రజలు.. ప్రతిపక్షాలు మీడియా కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు.ఆ తీపి కబురు అంత పనికొచ్చే ముచ్చట కాదా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా గురువారం నాడు ఆరో విడత హరితహారం కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్ లో సీఎం కేసీఆర్ అల్లనేరేడు మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం తన ప్రసంగంలో ఈ తీపి కబురు ఉంటు౦దని అందరూ భావించగా మొక్కలు నాటురి.. అడవిని పెంచుదామని చెప్పి వెళ్లిపాయె. ఎలాంటి కబురు ప్రకటించలేదు.

కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత మీడియాతో పాటు రైతులు ప్రజలు ఆ తీపి కబురుపై ఆసక్తిగా చర్చించుకున్నారు. ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా గమనించాయి. కానీ ప్రకటన చేసి నెల దాటింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రైతుల కోసం కేసీఆర్ తీపి కబురు అందించనే లేదు. మరోవైపు రైతులు భూ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

పలుచోట్ల రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇక వ్యవసాయ పనులు మొదలయ్యాయి. కొత్తగా నియంత్రిత వ్యవసాయం అని కేసీఆర్ ప్రకటించారు. అది కొంత గందరగోళంగా ఉంది. ఎలాంటి స్పష్టత లేదు. ఈ సమయంలో కేసీఆర్ రైతులకు ఒక సందేశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా కేసీఆర్ రైతులకు తీపి కబురు ప్రకటించాలని అందరూ కోరుతున్నారు.అయినా కెసిఆర్ తాను అనుకున్నప్పుడే ఏదేనా చెప్తాడు గాని మనం అడిగితే వింటారా?



Related posts

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N