ప్రపంచ దిగ్గజ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ లాంచ్ చేయనున్న తన తర్వాత తరం మొబైల్ ఐఫోన్-12 గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు ఐఫోన్ ప్రియులందరినీ ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 12 రానుందని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఐఫోన్ కొనేవారికి వైర్డ్ హెడ్ ఫోన్స్ తో పాటు అడాప్టర్ బాక్స్ తో పాటు అందిస్తారు. అయితే ఈసారి ఈ రెండూ…. బాక్స్ తో పాటుగా రాకపోవచ్చని తెలుస్తోంది.
ఎంత ఖరీదైన యాపిల్ ఎయిర్ పోడ్స్ సేల్ ను పెంచడం కోసం కంపెనీ ఈ నిర్ణయం తీసుకొందట. ఈ విషయాన్ని ఒక విశ్లేషకుడు గతంలోనే చెప్పగా… ఎయిర్ పోడ్స్-2 ఎయిర్ పోడ్స్ అమ్మకాలను పెంచడానికి యాపిల్ ఈ నిర్ణయం తీసుకుందట.
ఇకపోతే ఐఫోన్ 12 బాక్స్ లో ఫోన్ తో పాటు యు ఎస్ బి type-c కేబుల్ నుంచి లైటెనింగ్ కన్వర్టర్ కేబుల్ ను మాత్రమే అందించేలాగా యాపిల్ పంపిణీదారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలు నిజమే అయితే ఇకపై మీరు పవర్ అడాప్టర్ ను కూడా ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసి ఉంటుంది. అమెరికాలో ఐదు వాట్ల యాపిల్ అడాప్టర్ ధర $19 అనగా సుమారు రూ. 1500 రూపాయలు. 18 వాట్ల ఆ అడాప్టర్ ధర 29 డాలర్లు కాగా అది రూ. 2100 ఉంటుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… రెండు హైఎండ్ ఐఫోన్ 12 ప్రో మోడళ్లలో వెనకవైపు మూడు కెమెరాలను అందించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటిలో లిడార్ స్కానర్ అనే ఫీచర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఏఆర్ అనుభవం మరింత అద్భుతంగా ఉండనుంది. ఎయిర్ పోడ్స్ తర్వాతి వెర్షన్ 2021 ప్రారంభంలో లాంచ్ కానున్నట్లు సమాచారం.