NewsOrbit
జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Breaking: జాబిల్లి పై ఇస్రో కీలక ప్రకటన .. చంద్రుడికి ఆ ఖనిజాలు గుర్తించిన రోవర్

Advertisements
Share

Breaking: ప్రస్తుతం చంద్రుడి దక్షిణ దృవ ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ .. జాబిల్లి నుండి శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి భూమికి పంపుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది. చంద్రుడి ఉపరితలంపై ఖనిజాలు ఉన్నట్లు రోవర్ గుర్తించి సమాచారం ఇచ్చినట్లు ఇస్రో ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్ అనవాళ్లు ఉన్నట్లు రోవర్ గుర్తించింది.  అల్యూమినియం, మాంగనీస్, కాల్షియం, ఐరన్, క్రోనియం, టైటానియం, సిలికాన్ అనవాళ్లను రోవర్ గుర్తించిందని ఇస్రో తెలిపింది.

Advertisements

హైడ్రోజన్ కోసం శోధన కొనసాగిస్తొందని తెలిపింది. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు .. అక్కడి రసాయన ఖనిజాలను పరిశోధించేందుకు లిబ్స్ పరికరాన్ని పంపించారు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో – అప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాల లో అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది.  చంద్రయాన్  – 3 మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ చంద్రుడి నుండి శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి పంపుతుంది. ఈ నెల 23వ తేదీన జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దింగింది. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్ నుండి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై అధ్యయనం చేస్తూ సమాచారాన్ని పంపుతోంది.

Advertisements

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు


Share
Advertisements

Related posts

పెళ్లి తరవాత భార్యతో ఫస్ట్ టైమ్ బయటకి వచ్చిన నితిన్ – క్యూట్ కపుల్ ఫోటో వైరల్

Naina

Chalo Vijayawada: విజయవాడలో హైటెన్షన్ .. ఎక్కడికక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయులు అరెస్టులు..

somaraju sharma

కరోనా కొత్త లక్షణం.. కంట్లో అలా అవ్వడం కూడా అదే!

Teja