NewsOrbit
జాతీయం న్యూస్

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ .. రాఖీ కానుకగా రూ.200 తగ్గింపు

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఇలా చెక్ చేసుకోండి!!
Share

వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పించి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలెండర్ ధరను రూ.200 మేర తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గృహ అవసరాల కోసం వంట గ్యాస్ కొనుగోలు చేసే ఉజ్వల పథకం లబ్దిదారులతో పాటు అన్ని కేటగిరిల వినియోగదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సామాన్యులకు భాగంగా మారిన వంట గ్యాస్ సిలెండర్ ధరను తగ్గిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ఓనం, రక్షా బంధన్ (రాఖీ) పండుగ సందర్భంగా మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ .. ఎల్పీజీ ధర తగ్గింపుపై కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు.

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఇలా చెక్ చేసుకోండి!!

 

పేదల కోసం తీసుకువచ్చిన ఉజ్వల పథకం కింద ఒక్కో సిలెండర్ పై ఇప్పటికే రూ.200లు రాయితీ ఇస్తుండగా, ఇకపై రూ.400లు సబ్సిడీ అందుతుందని వివరించారు మంత్రి ఠాకూర్. మిగిలిన వినియోగదారులకు రూ.200లు రాయితీ అందుతుందని చెప్పారు. అంతే కాకుండా రక్షా బంధన్ సందర్భంగా 75 లక్షల మంది మహిళలకు ఉచితంగా ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద 9.6 కోట్ల మంది లబ్దిదారులు ఉండగా, 75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్లు కొత్త కుటుంబాలకు ఇస్తామని తెలిపారు. ఆడపిల్లలకు పెళ్లై కొత్తగా కుటుంబాలుగా ఏర్పడి .. కొత్త రేషన్ కార్డులు పొందినవారికి ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

చంద్రయాన్ – 3 ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించినట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. విక్రమ్ ల్యాండర్ ను సాఫ్ట్ ల్యాండ్ చేయడం సహా ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడి ఉపరితలంపై దించడం ద్వారా .. ఇస్రో సాధించిన విజయం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత పురోగతిని మరో సారి ప్రపంచానికి చాటిందని మంత్రి వర్గం కొనియాడింది. మరో పక్క గ్యాస్ ధర తగ్గింపుపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “దేశ ప్రజలను తన కుటుంబంగా మోడీ అభివర్ణిస్తూ ‘రక్షాబంధన్’ పండుగ మా కుటుంబంలో సంతోషాన్ని నింపింది. గ్యాస్ ధరల తగ్గింపు నా కుటుంబంలోని సోదరీమణుల సౌలభ్యాన్ని పెంచుతుంది. సోదరసోదరీమణులందరూ ఆరోగ్యంగా ఉండాలి” అంటూ ట్విట్ చేశారు.

బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు


Share

Related posts

Acharya: “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ తర్వాత అతిపెద్ద రోల్ అతనిదే నట.??

sekhar

Free Insurance offer: గుడ్ న్యూస్.. ప్రజలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ ఆఫర్ చేసిన ఆ సంస్థ..!

Ram

ఇకపై ట్రాన్స్‌జెండర్‌లకు రైస్ కార్డులు మంజూరు

Special Bureau