NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్

Share Chat: షేర్ చాట్ యాప్ తో విసిగిపోయారా..? దానికంటే బెస్ట్ టాప్ 5 యాప్స్ ఇవే!

Top 5 Alternatives to Share Chat App in 2023
Advertisements
Share

Share Chat: సోషల్ మీడియా లో నెటిజెన్స్ డైలీ వాడే మాధ్యమాలలో ఒకటి షేర్ చాట్ యాప్. ఈ యాప్ లో సంత్సరాలు ఎంత వేగవంతంగా వ్యాప్తి చెందుతుందో మన అందరికీ తెలిసిందే. కేవలం వార్తలు మాత్రమే కాకుండా, ఇంస్టాగ్రామ్ లో ఉన్నట్టుగా రీల్స్ కూడా చేసుకునే వెసులుబాటు ఈ షేర్ చాట్ యాప్ లో ఉంటుంది. అలాగే మన బంధుమిత్రులతో లైవ్ చిట్ చాట్ కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. కోట్లాది మంది భారతీయులు ఇప్పటికీ షేర్ చాట్ ని భారీ సంఖ్యలో ఉపయోగిస్తూనే ఉన్నారు. అందులో వచ్చే వార్తలను వాట్సాప్ లలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే కాలం గడిచేకొద్దీ కొత్త యాప్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రతీ రోజు ఇదే యాప్ ని ఉపయోగించి బోర్ కొట్టిన వాళ్ళు దానికంటే బెటర్ యాప్స్ ఏముంటయా అని వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మేము షేర్ కంటే గొప్ప ఫీచర్స్ ఉన్న కొన్ని యాప్స్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము. వాటిని వెంటనే గూగుల్ ప్లే లో డౌన్ లోడ్ చేసుకోండి.

Advertisements

1) త్రిల్లర్ – సోషల్ వీడియో ప్లాట్ ఫార్మ్

Advertisements

అమెరికా కి చెందిన కార్నీజ్ టెక్నాలజీస్, ప్రాక్సిమా మీడియా సంస్థలు సంయుక్తంగా కలిసి తయారు చేయించిన యాప్ ఇది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చెయ్యబడ్డ ఈ యాప్ లో మనం కోరుకున్న ఫిల్టర్లు వాడి వీడియోస్ చెయ్యొచ్చు. ఈ యాప్ ని ఆటో ఎడిటింగ్ అల్గారిథమ్ తో చెయ్యబడింది , అంటే కాకుండా 100 రకాల ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఈ ఫిల్టర్స్ ద్వారా వీడియోస్ మీద మీరు కోరిన డ్రాయింగ్స్ మరియు ఎమోజీస్ ని ఉపయోగించవచ్చు. అంతే కాదు మనం వీడియోస్ చేసే తప్పదు , మనం కోరుకున్న ఆడియోస్ కూడా అందుబాటులో ఉంటాయి, లేటెస్ట్ గా విడుదలైన టాప్ 10 సాంగ్స్ ని కూడా ట్రెండింగ్ లో ఉంచుతారు ఈ అప్లికేషన్ లో. ఇక మన స్నేహితులు , బంధువులతో గ్రూప్ వీడియో కాల్స్ కూడా ఈ యాప్ లో చేసుకోవచ్చు.

2) బోలో ఇండియా – షార్ట్ వీడియో యాప్

ఈ యాప్ ని మన ఇండియన్స్ క్రియేట్ చేసారు. తెలుగు , హిందీ , తమిళం,మలయాళం, కన్నడ ఇలా ఇండియా లో ఎన్ని భాషలు ఉన్నాయో, అన్నీ భాషల్లో కూడా యాప్ అందుబాటులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ , ఎంటర్టైన్మెంట్ , స్పోర్ట్స్, ట్రావెల్ , ఫుడ్ , హెల్త్ వంటి విభాగాలతో పాటుగా కాంపిటీటివ్ పరీక్షలకు సంబంధించిన విలువైన వీడియోలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది, వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

3) దబ్ స్మాష్ – క్రియేట్ & వాచ్ వీడియోస్

మన ఇండియాలోకి టిక్ టాక్ రాకముందు అత్యంత పాపులర్ అయినా యాప్ ఇది. ఈ యాప్ ని అమెరికా కి చెందిన హార్ట్ కోర్ క్యాపిటల్,ఇండెక్స్ వెంచర్స్, లోయర్ కేసు క్యాపిటల్ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టి తయారు చేయించారు. ఇప్పటికీ ఈ యాప్ ని మన ఇండియన్స్ లక్షల సంఖ్యలో వాడుతూనే ఉన్నారు. టిక్ టాక్ వచ్చిన తర్వాత ఈ యాప్ కి క్రేజ్ కాస్త తగ్గింది కానీ, దీనికి అలవాటు పడిన వాళ్ళు మాత్రం ఇంకా ఈ యాప్ ని వాడుతూనే ఉన్నారు. ఒకవేళ ఇంస్టాగ్రామ్ రీల్స్ రాకపొయ్యుంటే కచ్చితంగా ఈ యాప్ ఇంకా పెద్ద హిట్ అయ్యేది ఏమో. కానీ షేర్ చాట్ వాడుతూ బోర్ కొట్టిన నెటిజెన్స్ కి ఈ యాప్ ఒక బెస్ట్ ఛాయస్ గా చెప్పొచ్చు. ఇంకా డౌన్లోడ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటె వెంటనే గూగుల్ ప్లే యాప్ లో డౌన్ లోడ్ చేసుకోండి.

4) ఇంజాయ్ – ఇండియన్ కామెడీ, మెమే

ఈ యాప్ లో మొత్తం ఫన్ వీడియోస్ ఉంటాయి, అంతే కాకుండా మనకి మనం ఫన్నీ మెమే ని క్షణాల్లో క్రియేట్ చెయ్యొచ్చు. ఫేస్ బుక్ , ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ తదితర పాపులర్ యాప్స్ లో ఉన్న పాపులర్ వీడియోస్ ని క్షణాల్లో ఈ యాప్ లో షేర్ చెయ్యొచ్చు. ఇక ఈ యాప్ లో ఉన్న DIY టూల్స్ తో ప్రాంక్ వీడియోస్ క్రియేట్ చేసి మీ స్నేహితులను సరదాగా ఆటపట్టించొచ్చు. ఇక మనకి ఇష్టమైన కంటెంట్ సెర్చ్ చేసుకోని చూసే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. అలాగే ప్రతీ రెండు వారాలకు సరికొత్త ఫీచర్స్ తో మన ముందుకు వస్తుంది ఈ యాప్. గూగుల్ ప్లే లో ఈ యాప్ అందుబాటులో ఉంది, వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

5 ) రోపోస్కో – ఇండియన్ షార్ట్ వీడియో యాప్

ఈమధ్య కాలం లో మంచి ప్రాచుర్యం పొందిన యాప్ ఇది . ఇండియా లో ఉన్న అన్నీ ప్రాంతీయ బాషలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. మనకి ఏ విభాగానికి కావాల్సిన వీడియో కావాలన్నా ఈ యాప్ లో అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ ట్రెండింగ్ ఆడియోస్ తో వీడియోలను క్రియేట్ అప్లోడ్ చెయ్యొచ్చు. గూగుల్ ప్లే లో మంచి రేటింగ్ తో ట్రెండ్ అవుతున్న ఈ యాప్ ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.


Share
Advertisements

Related posts

Google: మీరు కనుక ఈ  డిగ్రీ చేసి ఉంటే గూగుల్ లో జాబ్ గ్యారెంటీ …!

Ram

Bigg Boss Telugu 5: నో డౌట్ మూడవ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం గ్యారెంటీ..??

sekhar

AR Rehman: మెగా హీరో సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్..!!

sekhar