Neevalle Neevalle ఆగస్టు 14: బుల్లితెరపై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సీరియళ్లలో ‘నీ వల్లే నీ వల్లే’ సీరియల్ ఒకటి. ఈ సీరియల్‌లో ఐపీఎస్ అధికారిణి ‘ప్రీతి’ పాత్ర పోషిస్తున్నది ‘మాహి గౌతమి’. సీరియల్‌లో తన చిన్నప్పుడే తల్లి కోల్పోతుంది. ప్రీతి వాళ్ల నాన్న ఓ రౌడీ దగ్గర పని చేస్తుంటాడు. ఆయన ఎమ్మార్వో శుభద్ర కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. అయితే ప్రీతి చిన్నప్పుడు శుభ్రద దగ్గర పెరుగుతుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎమ్మార్వో శుభద్ర కొడుకు డాన్‌గా మారుతాడు. ఐపీఎస్ అధికారిణిగా ప్రీతి.. డాన్‌గా మారిన అన్న మధ్య సాగే కథా సన్నివేశాలు.. ఫ్యామిలీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సీరియల్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది.

2020 డిసెంబర్ 21న ప్రారంభమైన ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారం అవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది. ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారి కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా అన్ని ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీరియల్‌లో పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తున్న మాహి గౌతమి ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యారు. ఆమె చుట్టూ కథ సాగడంతో మాహికి ప్రేక్షకుల ఆదరణ పెరిగింది. అయితే మాహి గౌతమి గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఈ రోజు తెలుసుకోబోతున్నాము. ఆమె జననం, వయసు, చదువు, సీరియల్ ప్రస్థానం, ఆమె ఇష్టాలు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మాహి గౌతమి జననం, విద్యాభ్యాసం..
1995 నవంబర్ 21న తెలంగాణలోని హైదరాబాద్ పట్టణంలో మాహి గౌతమి జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 28 సంవత్సరాలు. హోలీ మేరీ కాన్వెంట్ స్కూల్‌లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆ తర్వాత బీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) చదివారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌పై ఇష్టం ఎక్కువ. స్కూల్‌లో ఉన్నప్పుడు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, స్కిట్స్ చేయడం వంటి యాక్టివిటీస్‌లో పాల్గొనేవారు. నెట్‌బాల్ స్కూల్ గేమ్స్‌లో జిల్లా స్థాయిలో కూడా ఆడారు.

యాంకర్ నుంచి బుల్లితెర నటిగా..
బీటెక్ పూర్తి చేసుకున్న మాహి గౌతమి మొదటగా ‘మన రేడియో’లో ఆర్జేగా పని చేశారు. ఈ తర్వాత ‘వంతియా టీవీ’లో యాంకర్‌గా ఛాన్స్ వచ్చింది. యాంకర్‌గా ఆమె టీవీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా కొన్ని షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. నటనలో ఆమె మెళుకువలు నేర్చుకున్నారు. షార్ట్ షిల్మ్ ద్వారా ఆమె బాగానే ఫేమ్ అయ్యారు. దాంతో ఆమెకు సీరియల్‌లో లీడ్ రోల్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది. బుల్లితెరపై ‘నీ వల్లే నీ వల్లే’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆమె నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దాంతో ఆమెకు పలు ఛానెళ్ల నుంచి సీరియళ్లలో నటించే అవకాశం వచ్చింది. జీ తెలుగులో ప్రసారమయ్యే ‘అగ్నిసాక్షి’, ఈటీవీ తెలుగులో ప్రసారమయ్యే ‘రంగుల రాట్నం’, జీ తెలుగులో ప్రసారమయ్యే ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ వంటి సీరియళ్లలో నటిస్తూ బుల్లితెర టాప్ నటిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

Neevalle Neevalle Actress: మాహి గౌతమి ఇష్టాలు..
మాహి గౌతమి ఎప్పుడూ మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుంటుంది. ఆరోగ్యం పట్ల ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. టైంకి తినడం, వ్యాయామం వంటివి ప్రతిరోజూ చేస్తుంటారు. మాహికి డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మూడ్ బాగాలేనప్పుడు ఇంట్లో సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేసేస్తుంటారని ఆమె పలు ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఆమెకు ట్రెక్కింగ్ అన్నా.. ట్రావెలింగ్ అన్నా చాలా ఇష్టమట. ఫ్రీ షెడ్యూల్‌లో ఆమె విహారయాత్రలకు వెళ్తుంటారు. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి షాపింగ్స్‌కు వెళ్లడం అంటే మాహికి చాలా ఇష్టమట. అలాగే ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతుంటారు.

సోషల్ మీడియాలోనే క్రేజ్ ఎక్కువే..
మాహి గౌతమికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలొయింగ్ ఎక్కువ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు లక్షల్లో ఫాలొవర్స్ ఉన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన డైలీ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. సీరియల్ షెడ్యూల్ గ్యాప్‌లో రీల్స్ చేస్తూ తన అభిమాలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటారు.