NewsOrbit
జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !

Advertisements
Share

Jio Air Fiber: రిలయన్స్ జీయో ఈ ఏడాది వినాయక చవితి రోజున సెప్టెంబర్ 19న ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. జియో ఫైబర్ సేవలు దేశ వ్యాప్తంగా ఎలా విస్తరించి ఉన్నాయి. జియో ఫైబర్ కు, జియో ఎయిర్ ఫైబర్ కు తేడా ఏమిటి..? ఎలా పనిచేస్తుంది..? అనే విషయాలను ఒక సారి పరిశీలిస్తే..

Advertisements

 

జీయో ఎయిర్ ఫైబర్ అనేది వైర్ లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ఫైబర్ కనెక్షన్ కు ధీటుగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క డబ్బా లాంటి పరికరాన్ని మీ ఇంట్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే 5 జీ టెక్నాలజీ తో అది హైస్పీడ్ వైఫైగా మారిపోతుంది. ఎలాంటి కేబుల్స్, వైర్లు లేకుండానే ఇంట్లో ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.

Advertisements

 

ఒక కుటుంబం సరాసరి నెలకు 280 జీబీ డేటా ఖర్చు చేస్తుండగా, ఇది జియో మొబైల్ డేటాకంటే 10 రెట్లు ఎక్కువ. వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లను సులభతరం చేయడానికి ఆర్కిటెక్చర్ అవసరం. నగరాల్లో సమస్య లేదు కానీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, కనెక్షన్ కోసం అవసరమైన ఆప్టికల్ ఫైబర్‌ను వేయడం కంపెనీలకు సవాల్ గా మారింది. జియో ఆప్టికల్ ఫైబర్ భారతదేశం అంతటా 1.5 మిలియన్ కిలో మీటర్లకు పైగా విస్తరించింది. అయితే ఇది కూడా ప్రతి ఇంటిని చేరుకోవడానికి సరిపోదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ తీసుకువస్తొంది.

5 జీ డేటా నెట్‌ వర్క్ ను ఉపయోగించి ఎయిర్‌ ఫైబర్ ఇప్పటికే ఉన్న 5జీ టవర్ల నుంచి డేటాను సేకరిస్తుంది. వాటిని వినియోగదారులకు అందించడానికి  రిసీవర్‌లు, రౌటర్లను ఉపయోగిస్తుంది. ఎలాంటి కేబుల్స్ అవసరం లేకుండా రిసీవర్లు, రౌటర్లు జియో టవర్ల నుంచి 5 జీ డేటాను యాక్సెస్ చేస్తాయి. ఇళ్లల్లో రూటర్ ఉంటుంది. మరో అప్లయెన్స్ 5జీ సిమ్ కార్డుతో బయట ఉంటుంది. సమీపంలో ఉన్న టవర్ నుంచి 5 జీ డేటాను సేకరించి, రూటర్ ద్వారా ఇది వినియోగదారులకు అందిస్తుంది. 1 జీబీపీఎస్ బ్రాడ్‌ బ్యాండ్ వేగంతో 5జీ డేటా ఉపయోగించుకోవచ్చు. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కష్టంగా ఉన్న మారు మూల గ్రామీణ ప్రాంతాలకు దీని ద్వారా సులువుగా చేరుకోవచ్చు.

ఆప్టికల్ ఫైబర్ ద్వారా ప్రతీ రోజూ 15,000 ఇళ్లను జియో కనెక్ట్ చేయగలుగుతుంది. ఎయిర్ ఫైబర్ ద్వారా రోజుకు 1,50,000 కనెక్షన్లకు చేరుకుంటామని జియో వెల్లడించింది. ఎయిర్ ఫైబర్ ప్లాన్స్ వివరాలను సంస్థ ఇంకా తెలియజేయలేదు. ఈ నెల 19న ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్లాన్స్ ప్రకటించే అవకాశం ఉంది.

KCR: కొండంత ఆశ పెట్టుకున్న కెసిఆర్ కి భారీ బ్యాడ్ న్యూస్ చెప్పిన మోడీ !


Share
Advertisements

Related posts

రేపు కర్నూలులో పవన్ రోడ్‌షో

sarath

బ్రేకింగ్ : దెబ్బతో పేరు మార్చేసుకున్న ‘ఫెయిర్ & లవ్లీ’ క్రీమ్..!

arun kanna

Pawan kalyan 28 : పవన్ కళ్యాణ్ 28లో ప్రకాశ్ రాజ్..

GRK