Google Discover: ఉదాహరణకు… తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో గూగుల్ డిస్కవర్ లో ఎక్కువగా కనిపించే పొలిటికల్ కంటెంట్ ‘Telangana Today, నమస్తే తెలంగాణ,T News, సాక్షి, ఆంధ్రజ్యోతి, V6, ఈనాడు’, ఇలాంటి ప్రముఖ మీడియా సంస్థలదే. ఇవ్వన్నీ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ నాయకుల లేదా పార్టీల చేతిలో కీలు బొమ్మలే, ఇందులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సొంత సంస్థలు ఉండటం బాధాకరం. ఎన్నికల తరుణం లో వీరు రాసేది మాత్రమే జనాలకు చేరడం, అధికార పార్టీలను ప్రేశ్నిస్తున్న గొంతులకు చోటు డిస్కవర్ లో ఇరుకు అవ్వడం గూగుల్ గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని స్వేచ్చా గళాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత గూగుల్ కి లేదంటారా?

గూగుల్ సంస్థ తమ సెర్చ్ అల్గోరిథం లో కొన్ని మార్పులు తెస్తూ అక్టోబర్ లో ‘కోర్ అప్డేట్’ విడుదల చేసింది, ఇప్పుడు కొన్ని అదనపు మార్పులతో మరో నవంబర్ ‘కోర్ అప్డేట్’ కూడా విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే ఎన్ని కోర్ అప్డేట్ లు విడుదల చేసినా రాజకీయ కంటెంట్ పట్ల గూగుల్ అంతర్గత శైలిలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా… ఇండియా లోని పలు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అవుతున్న ఈ తరుణం లో ఈ విషయం పై చర్చించడం చాలా అవసరం…పొలిటికల్ కంటెంట్, రాజకీయ విశ్లేషణ, సోషల్ కామెంట్రీ ఇలాంటివి ఇపుడు ఎక్కువగా పాఠకులు గూగుల్ డిస్కవర్, గూగుల్ న్యూస్ లోనే చూస్తున్నారు, అయితే ఇక్కడ కూడా టీవీ న్యూస్ చానెల్స్ దే ఆధిపత్యం, అందులో చాలా వరకు రాజకీయ నాయకుల న్యూస్ మీడియా లేదా రాజకీయ పార్టీల తో పొత్తు ఉన్న మీడియా సంస్థలే ఎక్కువ అని చెప్పాలి.
అసలు కోర్ అప్డేట్ అంటే
మీరు మీ స్మార్ట్ ఫోన్లో లేదా కంప్యూటర్ లో ఏదైనా సమాచారం తెలుసుకోవాలి అంటే గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెడతారు. ఒకసారి మనం సెర్చ్ చేసిన తరువాత మనకు సెర్చ్ ఫలితాలు కొనపడుతాయి, ఈ ఫలితాలతో ఏది ముందు కనపడాలి ఏది మనకు సరైనది అని నిర్దేసించేదే గూగుల్ సెర్చ్ అల్గోరిథం. ఉదాహరణుకు మీరు గూగుల్ లో ‘న్యూస్ ఆర్బిట్’ అని టైపు చేస్తే ఈ వెబ్సైటు కాకుండా ఇంకేదో రాకుండా ఉండేలా, ‘తెలుగు న్యూస్’ అని టైపు చేస్తే ఏ వార్తా పత్రికలు రావాలి ఇలాంటి వాటిని అల్గోరిథం అదుపు చేస్తుంది. అయితే మారుతున్న అవసరాలను దృష్టి లో పెట్టుకుని గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు ఈ అల్గోరిథం నవీకరణ చేస్తూ ఉంటుంది, దీనినే మనం కోర్ అప్డేట్ అని పిలుస్తాం.
గూగుల్ పెద్ద సంస్థలకు పెద్ద పీఠం వేస్తుంది అని పలు మార్లు ఆరోపణలను ఎదుర్కొంది, ఇలాంటి వాటి మీద అమెరికా కాంగ్రెస్ ముందు కూడా సంజాయిషీ ఇచ్చుకుంది. స్వతంత్ర కంటెంట్ సృష్టికర్తలకు పెద్ద సంస్థల తో సమానంగా నిస్పక్షపాతంగా కేవలం ‘నిజం’ తరుపున ఉండేలా గూగుల్ చాలా మార్పులు చేసింది. అయితే పొలిటికల్ కంటెంట్ విషయం లో మాత్రం ఇండియా లాంటి దేశాలలో గూగుల్ వెనకడుగు వేస్తుంది.
ఎందుకంటే…రాజకీయ వార్తల విషయం లో ఇండియా లాంటి ప్రాంతాలలో గూగుల్ వెనుకడుగు వేస్తుంది. అంతే కాదు డబ్బు బాగా ఉండే ప్రధాన సంస్థలు రకరకాలుగా ప్రయత్నించి, గూగుల్ డిస్కవర్ లాంటి ప్లాటుఫామ్స్ మీద కూడా వీరిదే పై చేయి ఉండేలా చూసుకున్నారు. రాజకీయ వార్తల విషయం లో గూగుల్ ఇంకా ఇండిపెండెంట్ కంటెంట్ ని నమ్మట్లేదు అని చెప్పాలి.
ఉదాహరణకు… తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో గూగుల్ డిస్కవర్ లో ఎక్కువగా కనిపించే పొలిటికల్ కంటెంట్ ‘Telangana Today, నమస్తే తెలంగాణ,T News, సాక్షి, ఆంధ్రజ్యోతి, V6, ఈనాడు’, ఇలాంటి ప్రముఖ మీడియా సంస్థలదే. ఇవ్వన్నీ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ నాయకుల లేదా పార్టీల చేతిలో కీలు బొమ్మలే, ఇందులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సొంత సంస్థలు ఉండటం బాధాకరం. ఎన్నికల తరుణం లో వీరు రాసేది మాత్రమే జనాలకు చేరడం, అధికార పార్టీలను ప్రేశ్నిస్తున్న గొంతులకు చోటు డిస్కవర్ లో ఇరుకు అవ్వడం గూగుల్ గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని స్వేచ్చా గళాన్ని కాపాడాల్సిన నైతిక బాధ్యత గూగుల్ కి లేదంటారా?