NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok sabha Election: కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

Lok sabha Election: ఎన్నికల కోడ్ అమలు అవుతున్న సమయంలో రాజకీయ పార్టీల నేతలు ఏర్పాటు చేసే సమావేశాలకు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు. దూరంగా ఉండాలి. ఒక వేళ ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటే అది కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా గుర్తిస్తారు. తాజాగా ఓ రాజకీయ పార్టీ నేత, అభ్యర్ధి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వంద మందికిపైగా ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.

విషయంలోకి వెళితే..మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి ఇటీవల సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో ఉపాధి హమీ, సెర్ప్ ఉద్యోగులతో సమావేశమైయ్యారు. గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పని చేసిన అనుభవం, పరిచయాలతో లోక్ సభ సీటు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు, పలవురు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. దీనిపై మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీసీ టీవీ పుటేజీ అధారంగా సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించారు. 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులను సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 106 మంది ఉద్యోగులను ఒక్క ఉత్తర్వుతో సస్పెండ్ చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.

ఈ సమావేశం అత్యంత రహస్యంగా నిర్వహించినప్పటికీ రాత్రి 11 గంటల సమయంలో విషయం లీకైంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఫంక్షన్ హాలు వద్దకు చేరుకోగా, అక్కడి సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చే సమయానికి వెంకట్రామిరెడ్డి, ఉద్యోగులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో అక్కడి సీసీ టీవీ పుటేజీని పరిశీలించి చర్యలు తీసుకున్నారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో కలవరం మొదలైంది.

BCYP: బీసీ యువజన పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదల ..పవన్ పై పిఠాపురంలో అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహద్రి

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N