NewsOrbit
టెక్నాలజీ

TCS: డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి బంపర్ ఆఫర్..TCS లో సాఫ్ట్ వేర్ జాబ్స్..!!

Advertisements
Share

TCS: దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ TCS నీ అనుసంధానం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రెడీ అయింది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ప్రారంభమైంది. ఈ టెక్నాలజీతో ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్ లకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS).. అవకాశాలు అందించడానికి సిద్ధమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది.

Advertisements

Bumper offer for those who passed degree engineering Software jobs in TCS

ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అప్లై చేసుకోవటం కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ సెప్టెంబర్ 20వ తారీకు. ఈ క్రమంలో ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పని కూడా లేదు. రిక్రూట్మెంట్ కి సంబంధించి కేవలం ఒకే ఒక్క ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ ద్వారా తెలియజేసి ఎంపిక జరుగుద్ది. ఇంటర్వ్యూ టెస్టు అక్టోబర్ 20వ తారీకు నిర్వహించబోతున్నారు. TCS డిజిటల్ సెంటర్ నందు టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ లో పాస్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ శాలరీ 35000 ఇవ్వటం జరుగుద్ది. అప్లై చేసుకునే సమయానికి ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా గానీ అవకాశం కంపెనీ ఇవ్వటం జరిగింది.

Advertisements

Bumper offer for those who passed degree engineering Software jobs in TCS

24 నెలలు కెరీర్ గ్యాప్ ఉన్న గాని అప్లై చేసుకునే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయితే ఏడు రోజులు 24 గంటలు పని చేయడానికి సిద్ధంగా ఉండే రీతిలో రెడీ అవ్వాలి. అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని కూడా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో స్పష్టం చేయడం జరిగింది. ఫ్రెషర్స్ కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.


Share
Advertisements

Related posts

టాటా వారి కొత్త ఉత్పాదన ఈ కార్..! ఫీచర్లు సూపర్..!

bharani jella

కీలక నిర్ణయం తీసుకున్న ఫేస్ బుక్.. అదేంటో చూడండి.. యూజర్లకు షాకేనా..

bharani jella

Ecofriendly Mask: ఈ కుర్రోడి ఐడియా అదిరింది గురూ.. ఫాలో అవ్వాల్సిందే..!!

bharani jella