NewsOrbit
టెక్నాలజీ

Xiaomi Smart TV X Pro Series: మార్కెట్‌లోకి Xiaomi Smart TV..లు వాటి యొక్క ధరలు మరియు పూర్తి వివరాలు..!!

Share

Xiaomi Smart TV X Pro Series: 2023వ సంవత్సరం షియోమీ స్మార్ట్ టీవి X ప్రో అనే కొత్త సిరీస్ టీవీలను  మార్కెట్ లో విడుదల చేయడం జరిగింది. 43, 50, 55 అంగుళాల మోడల్స్ లో ఈటీవీలు మార్కెట్ లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వైఫై మరియు ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో స్మార్ట్ ఫోన్ హవా నడుస్తోంది. అయినా గాని ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. టీవీల విషయంలో ఎక్కువగా స్మార్ట్ టీవీ లు వైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో షియోమీ “స్మార్టర్ లివింగ్” ఈవెంట్ లో… కొత్త సిరీస్ టీవీలను విడుదల చేయడం జరిగింది. సౌండ్ క్వాలిటీ.. మెరుగైన పిక్చర్.. వంటి ప్రొడక్ట్స్ తో కొత్త కొత్త కంపెనీలు మోడల్స్ మార్కెట్ లో టీవీలో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారికి అందుబాటు ధరలో టీవీలు ఉండే విధంగా.. మార్కెట్ రేట్ ఫిక్స్ చేస్తున్నాయి.

Xiaomi Smart TVs in the market their prices and full details

ఈ తరహా లోనే MI X PRO సిరీస్ టీవీలో మార్కెట్ లోకి లాంచ్ కావటం జరిగింది. సొంత ప్యాచ్ వల్ టెక్నాలజీతోపాటు ఆండ్రాయిడ్ సపోర్టెడ్ కలిగిన ఈ స్మార్ట్ టీవీలు డాల్ఫిన్ విజన్ ఐక్యూ, వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 సాంకేతికతతో వినియోగదారులకు సూపర్ త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోడ్, ప్యాచ్‌వాల్+తో ఉచిత లైవ్ టీవీ, మి హోమ్ ఇంటిగ్రేషన్ వంటి మరిన్ని ఫీచర్‌లతో ప్యాచ్‌వాల్ ఉంటుంది. అంతేకాదు అధిక స్క్రీన్-టు-బాడీ రేషియోతో ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

Xiaomi Smart TVs in the market their prices and full details

ఇవి 4K HDR మద్దతు, 3840 x 2160 స్క్రీన్ రిజల్యూషన్‌తో వస్తాయి.టీవీలలో వివిడ్ పిక్చర్ ఇంజన్ 2, హెచ్‌ఎల్‌జీ రియాలిటీ ఫ్లో, డాల్బీ విజన్ ఐక్యూ, అడాప్టివ్ బ్రైట్‌నెస్‌ వంటి ఫీచర్లు సైతం ఈ కొత్త టీవీలలో అందించారు. అదే రీతిలో..షియోమీ ఇతర ఉత్పత్తులైన స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ 4, రోబో వ్యాక్యూమ్ Mop 2i, బిఎర్డ్ ట్రిమ్మర్ 2C, గ్రూమింగ్ కిట్ రిలీజ్ అయ్యాయి. ఈ టీవీలు ఎంఐ వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు అందుబాటులో ఉంటాయి. అలాగే 43 అంగుళాల టీవీ ధర రూ.32999 కాగా, 50 అంగుళాల టీవీ ధర రూ.41999, 55 అంగుళాల టీవీ ధర రూ. 47,999…అలాగే 43 అంగుళాల టీవీకి రూ.1500 బ్యాంక్ ఆఫర్, 50, 55 అంగుళాల టీవీలను రూ.2000…తగ్గింపు ధరలకు టీవీలను పొందుకోవచ్చు.


Share

Related posts

మంచి బడ్జెట్ లో బంగారం లాంటి ఫోన్ !

Kumar

లావా నుంచి నూత‌న ఫీచ‌ర్ ఫోన్‌.. బీపీ, హార్ట్ రేట్ తెలుసుకోవ‌చ్చు..

Srikanth A

టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. త‌క్కువ ధ‌ర‌కే చ‌క్క‌ని ఫీచ‌ర్లు..!

Srikanth A