AP DGP: “ఒక్కొక్కడినీ వదిలే ప్రసక్తే లేదు” డీజీపీ గౌతమ్ సవాంగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి..!

Share

AP DGP: కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఇన్సిడెంట్ ను పురస్కరించుకుని కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆత్మకూరులోని పద్మావతి విద్యాసంస్థ వెనుక భాగంలో మసీదు నిర్మాణంపై ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగింది. అక్రమంగా మసీదు నిర్మిస్తున్నారంటూ బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాగం వెంటనే అప్రమత్తమై ఆత్మకూరులో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించింది.

AP DGP gowtham sawang comments on atmakur incident

 

AP DGP: మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు

ఈ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ గా స్పందించారు. ప్రస్తుతం ఆత్మకూరులో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పేర్కొన్న డీజీపీ సవాంగ్.. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న కర్నూలు జిల్లాలో కొంత మంది కావాలనే మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు గౌతమ్ సవాంగ్. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ఆత్మకూరు ప్రాంతంలో పరిస్థితులను పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీకి డీజీపీ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

మరో పక్క ఆత్మకూరులో జరిగిన ఘటనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీి జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి జైచంద్ర లపై జరిగిన దాడిని ఖండిస్తూ నిందితులపై కేసులు నమోదు చేసి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

30 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

33 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago