NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వ్యూహం లో సోనియాను నెగటివ్ క్యారెక్టర్ గా చూపిస్తే సహించేది లేదంటూ ఆర్జీవీకి ఏపీసీసీ చైర్మన్ రుద్రరాజు స్టాంగ్ వార్నింగ్

Share

వివాదాస్పద దర్శకుడుగా పేరు గాంచిన రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ)..రాష్ట్రంలో వైసీపీకి మేలు చేసేందుకు సీఎం జగన్మోహనరెడ్డి జీవితంలో జరిగిన ఘటనలను ఇతి వృత్తంగా నిర్మించిన చిత్రం ప్యూహం టీజర్ నిన్న విడుదల అయ్యింది. అయితే వ్యూహం టీజర్ పై పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన కామెంట్స్ చేశారు. వ్యూహం సినిమాలో తమ పార్టీ అథినేత్రి సోనియా గాంధీని నెగిటివ్ క్యారెక్టర్ గా చూపించే ప్రయత్నం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సోనియాను చెడుగా చూపితే మాత్రం వర్మను బట్టలూడదీసి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. అసలు వాస్తవాలు వర్మకి తెలుసా అని గుడుగు రుద్ర రాజు ప్రశ్నించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అభిమానంతో రెండు భాగాలుగా వ్యూహం, శపథం సినిమాలు తీస్తున్నట్లుగా గతంలోనే ఆర్జీవి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల నిర్మాణం నేపథ్యంలో ఇటీవల సీఎం జగన్ తో కూడా ఆర్జీవి ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు.

APCC President Gidugu Rudraraju fires on Ram gopal Verma

 

గతంలోనూ వేసీపీకి మద్దతుగా కొన్ని చిత్రాలను తెరకెక్కించిన ఆర్జీవి.. తాజాగా జగన్ ను హీరోగా చూపించే కథనంతో వ్యూహం, శపథం సినిమాలు నిర్మాణం చేస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక టీజర్ విషయానికి వస్తే 2009 నుండి 2014 వరకూ జగన్ రాజకీయ జీవితంలో ఏం జరిగింది.. ఏపి రాష్ట్ర రాజకీయాలలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి వంటివి చూపించడం జరిగింది. ప్రధానంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం టీజర్ ప్రారంభించి .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న భావోద్వేగ వాతావరణంతో పాటు వైఎస్ కుటుంబంలో మరియు వైఎస్ రాజకీయ అనుచర వర్గంలో ఆయన చనిపోయిన తర్వాత చోటుచేసుకున్న పరిస్థితులను ఈ టీజర్ లో చూపించారు.

తండ్రి వైఎస్ ఆర్ మరణాన్ని జగన్ ఏ రంగా తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడ్డారు వంటివి అద్భుతంగా చిత్రీకరించారు. ఓదార్పు యాత్ర చేస్తుండగా జగన్ పై సీబీఐ దాడులు ఇంకా వైసీపీ రాజకీయ పార్టీ పెట్టడం చూపిస్తూన మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబును పరోక్షంగా నెగిటివ్ గా టీజర్ లో చూపించారు ఆర్జీవి. జగన్ పొలిటికల్ కేరీర్ ప్రారంభం నుండి పార్టీ ప్రారంభించే వరకూ చోటు చేసుకున్న పరిణామాలను వ్యూహం, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత జరిగిన పరిణామాలపై శపథం పేరుతో చిత్ర నిర్మాణం చేస్తున్నారు ఆర్జీవి. ఈ రెండు చిత్రాలు 2024 ఎన్నికలకు ముందే విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఆర్జీవి. అయితే వీటిపై రాజకీయ వర్గాల్లో ఆశక్తికరమైన చర్చ జరుగుతుండగా, పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు స్పందిస్తూ సీరియస్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇదే సందర్భంలో వైఎస్ షర్మిల రాజకీయ నిర్ణయాలపైనా స్పందించారు గిడుగు రుద్రరాజు. వైఎస్ఆర్ తనయ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని అన్నారు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలు, విధానాలకు కట్టుబడి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని పేర్కొన్నారు. దివంగత వైఎస్ఆర్ తమ పార్టీ నాయకుడని అన్నారు. రాహుల్ గాంధిని ప్రధాన మంత్రిగా చేయాలనేది తన చివరి కోరిక అని రాజశేఖరెడ్డి గతంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ తన తండ్రి కోరిక లో భాగస్వామురాలిగా వచ్చి షర్మిల వచ్చి పని చేస్తే తప్పకుండా స్వాగతిస్తామని అన్నారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి


Share

Related posts

షాకింగ్ డిమాండ్ :  “జగన్ రాజీనామా చేయాలి” !!

sekhar

వకీల్ సాబ్ గురించి ఎవరూ కంగారు పడక్కర్లేదు.. ఎప్పుడు రిలీజ్ చేయాలో దిల్ రాజు డిసైడై ఉన్నాడు ..!

GRK

అయోధ్య‌కు పొంచి ఉన్న వ‌ర‌ద ముప్పు.. భూమి పూజకు ఎఫెక్ట్‌..?

Srikanth A