NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Murder Case: సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతి

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case

YS Viveka Murder Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కరరెడ్డి, మరో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల పాటు కస్డడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో ఇటీవల భాస్కరరెడ్డి, అంతకు ముందు ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. నిందితులను పది రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కోర్టులో గట్టి వాదనలు వినిపించింది. వివేకాతో భాస్కరరెడ్డి, శివశంకర్ రెడ్డికి రాజకీయంగా విభేదాలు ఉన్నాయని తెలిపింది. హత్య కుట్రలో వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలది కీలక పాత్ర అని, వారిద్దరు దగ్గర ఉండి సాక్ష్యాలను చెరిపివేయించడమే కాక సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశారని సీబీఐ వెల్లడించింది.

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case
ys bhaskar reddy viveka murder case

 

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి భాస్కరరెడ్డితో పాటు శివశంకర్ రెడ్డి కృషి చేశారన్న సీబీఐ.. దీనిపై వివేకా ఆగ్రహంతో ఉండేవారని పేర్కొన్నారు. మరో పక్క నిందితులు భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తరపు న్యాయవాదులు  సీబీఐ వాదనలను వ్యతిరేకించారు. సీబీఐ కొందరినే లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు చేస్తొందని ఆరోపించారు. ఇద్దరూ వేర్వేర వాదనలు వినిపించారు. అసలు నిందితుల్ని పట్టుకోకుండా దర్యాప్తును సీబీఐ పక్కాదారి పట్టిస్తొందని ఆరోపించారు. నిందితులు ఇప్పటికే తమకు తెలిసిన సమాచారం అంతటినీ సీబీఐకి చెప్పినందున ప్రత్యేకంగా కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు. రిమాండ్ పిటిషన్ లోని అంశాలనే కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారనీ, అసలు కస్టడీ ఎందుకు అవసరమో చెప్పలేదన్నారు.

సీబీఐ మొదటి రెండు చార్జిషీట్ లలో భాస్కరరెడ్డి ప్రస్తావన లేదనీ, తప్పుడు సాక్ష్యాలతో సీబీఐ ఇరికించే ప్రయత్నం చేస్తొందని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశించిన సమయం దగ్గర పడుతోందనే అరెస్టులు చేస్తున్నారు తప్ప అధారాలను సేకరించడం లేదని ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నిన్న తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. కొద్ది సేపటి క్రితం ఆరు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలతో రేపటి నుండి ఈ నెల 24వరకూ ఉదయ్, భాస్కరరెడ్డిలను సీబీఐ ప్రశ్నించనున్నది.

అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా .. హైకోర్టులో వాడివేడిగా వాదనలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N