ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ganta srinivasa Rao : బిగ్ బ్రేకింగ్ : వైసీపీలోకి గంటా ? స్ట్రాంగ్ సాక్షం ఇదే?

Share

Ganta srinivasa Rao : గత ప్రభుత్వాల హయాంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తొలిసారిగా దాదాపు 20 నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినా గంటా శ్రీనివాసరావు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో గంటా అధికార వైసీపీలో చేరుతున్నారనీ, ముహూర్తం ఫిక్స్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే గంటా మౌనంగా వహించారు. తాజాగా విశాఖ ఉక్క కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపి వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కపరిశ్రమ పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని గంటా శ్రీనివాసరావు  నిర్ణయించారు. ఇందుకు నాన్ పొలిటికల్ జేఏసీ గా ఏర్పడాలని పిలుపునిస్తూ ముందుకుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఒక్క సారిగా రాజకీయ చర్చకు తెర లేపారు. .

Ganta srinivasa Rao : ganta srinivasa rao likely to join ysrcp విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
Ganta srinivasa Rao : ganta srinivasa rao likely to join ysrcp విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

Ganta srinivasa Rao : గంటా రాజీనామాతో రాజకీయ వర్గాల్లో చర్చ

అయితే గంటా రాజీనామా వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇది వైసీపీలో చేరేందుకు వ్యూహంలో భాగమేనని చర్చించుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇందుకు సాక్షంగా నిలుస్తుంది. సీఎం వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు గంటా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమనైన చర్చ జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు సలహాలు, పరిష్కారాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి సీఎం లేఖ రాసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు గంటా శ్రీనివాసరావు.

సీఎం జగన్ కు ధన్యావాదాలు తెపిన గంటా

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్నందున సీఎం జగన్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి వివరించాలని గంటా కోరారు. తెలుగు ప్రజలు, ముఖ్యంగా విశాఖ వాసుల మనోభావాలను ప్రధాన మంత్రి మోడికి వివరించి ఒప్పించాలని గంటా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ కు దగ్గర అయ్యేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారనీ, అందులో భాగంగానే రాజీనామా, ట్విట్టర్ వేదికగా సీఎంకు ధన్యవాదాలు తెలియజేయడం అని పలువురు పేర్కొంటున్నారు.


Share

Related posts

Sai Pallavi: సాయి పల్లవికి ఉన్న దమ్ము ఏంటో ప్రూవ్ అయ్యింది – సమంత , కాజల్ కి అంత దమ్ముందా?

Naina

వైకాపా టూ టీడీపీ వలసల బ్రేక్ కి – బాబు మంత్రం ఇదే ! 

sekhar

ఆ విషయం లో జగన్ పై వైసిపిలో తీవ్ర అసంతృప్తి ! ఏమిటది ??

Yandamuri
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar