NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

ఏపీలో రాజ‌కీయాలు స‌ల‌స‌ల మ‌రుగుతున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించేందుకు.. సీఎం జ‌గ‌న్ను అధికారం నుంచి దించేందుకు ప్ర‌తిప‌క్షాలు చేతులు క‌లిపాయి. కూట‌మిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు క‌లిసి ముందుకు సాగుతున్నాయి. ఇది ఒక‌ర‌కంగా వైసీపీకి ఇబ్బంది క‌లిగించే అంశ‌మే. అయినా.. ఎక్క‌డా అలాంటిది క‌నిపించ‌డం లేదు. పైగా.. వైసీపీకి ఎక్క‌డా స్టార్ క్యాంపెయిన‌ర్ల‌నూ పెట్టుకోలేదు. కూట‌మి ప‌క్షాన చూసుకుంటే.. నంద‌మూరి బాల‌య్య స్వ‌ర్ణాంద్ర సాకార యాత్ర చేస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలానూ ప్ర‌జాభిమానం.. అభిమానులు ఎక్కువ‌గా ఉన్న నాయ‌కుడు.

అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఉన్న ఇమేజ్ అందరికీ తెలిసిందే. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఇక‌, బీజేపీ ప‌క్షాన ప్ర‌ధాని మోడీ బ‌రిలోకి దిగుతున్నారు. ఇంకా చాలా మంది నాయ‌కులు కూడా రంగంలోకి రానున్నారు. ఇది ఒక‌ర‌కంగా వైసీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగించే సంద‌ర్భం. కానీ, అలాంటి సూచ‌న‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మ‌రి క‌నిపించ‌కుండా మేనేజ్ చేస్తున్నారో.. ఏమో తెలియ‌దు. మొత్తానికి చాలా ధీమాగా, ధైర్యంగా ఉన్నారు. అంతేకాదు.. `మంచి చేశామ‌ని అనుకుంటేనే ఓటు వేయండి` అని ఇప్పటికీ సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. దీంతో కూట‌మి బ‌ల‌మా? జ‌గ‌న్ బ‌ల‌వంతుడా? అనేది ప్ర‌శ్న‌గా మారింది.

మ‌రీ ముఖ్యంగా కూట‌మి ప‌క్షాన అధికారికంగా మేనిఫెస్టో ప్ర‌క‌టించ‌క‌పోయినా.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే సూప‌ర్ 6ను ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్పుడు ఏ డిజిట‌ల్ మాద్య‌మాన్ని ఓపెన్ చేసినా.. సూప‌ర్ 6 ప్ర‌చారం జోరుగా సాగుతోంది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం వంటి సంచ‌ల‌న హామీతోపాటు.. నెల నెలా రూ.1500 ఇస్తామ‌ని.. మాతృవంద‌నం పేరుతో రూ.15000 ఇస్తామ‌ని.. రైతుల‌కు ఏటా 20000 ఇస్తామ‌ని.. మ‌రీ ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు వంటివారికి ప్రాణ‌ప్ర‌దంగా మారిన‌ పింఛ‌నును రూ.4000 ల‌కు పెంచుతామ‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో మెగా డీఎస్సీపై నే తొలి సంత‌కం చేస్తామ‌ని కూడా చెప్పారు.

ఇవ‌న్నీ.. విన్నాక‌..క‌న్నాక‌.. స‌హ‌జంగానే అధికార ప‌క్షంలో ఉండి.. ఒంట‌రి పోరు చేస్తున్న పార్టీ ఏదైనా.. అలెర్ట్ కావాలి. అంత కుమించిన ప‌థ‌కాలు.. న‌గ‌దు అందించే స్కీమ్‌ల‌ను ప్ర‌క‌టించాలి. కానీ, ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్‌ అని వైసీపీ నాయ‌కులు అన్న‌ట్టు గా.. సీఎం జ‌గ‌న్ ఈ కూట‌మి సూప‌ర్ 6ను అస‌లు ప‌ట్టించుకోలేదు. ఎక్క‌డా మెరుపులు లేని మేనిఫెస్టోనే ప్ర‌క‌టించారు. పాత ప‌థ‌కాల‌నే కొన‌సాగిస్తామ‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. అత్యంత కీల‌క‌మైన పింఛ‌నును కూడా ఇప్పుడు పెంచేది లేద‌న్నారు. ఎప్పుడో 2028లో అది కూడా 250 రూపాయ‌లు పెంచుతామ‌ని చెప్పారు. అంటే.. దీని కోసం మూడేళ్లు ఆగాలి.

దీనిని సామాజిక పింఛ‌ను దారులు ఎలా తీసుకుంటార‌నేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌క‌టించేందుకు జ‌గ‌న్ ఎంత ధైర్యం చేశార‌న్న‌ది ప్ర‌శ్న‌. అంటే.. మొత్తంగా ఆయ‌న కూట‌మిని ప‌ట్టించుకోవ‌డం లేదా? లేక‌.. కూట‌మి త‌న‌కు పోటీ కాదని భావిస్తున్నారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?