Subscribe for notification

మీడియాతో చెలగాటం ప్రాణ సంకటం!! జగన్ తెలుసుకో

Share

అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లుంది జగన్ ప్రభుత్వం తీరు. తప్ప ఎవరో చేస్తే శిక్ష మరొకరికి అన్నట్లుగా ప్రభుత్వం చెలరేగి పోతుంది. ముఖ్యంగా మీడియా విషయంలో జగన్ ప్రభుత్వానికి మొదటి నుంచి మంచి అభిప్రాయం లేదు. జగన్ కు సొంత మీడియా ఉన్నప్పటికీ దానిని ఆయన శాసనసభలోనే గాలి తీసి సాక్షి తప్పుడు వార్తలు రాస్తోందని చెప్పడం మీడియా పై ఆయనకు అసలు ఎలాంటి అభిప్రాయం లేనట్లుగానే భావించాలి… ఇప్పుడు మీడియా ప్రతినిధులను మీడియాకు సంబంధించిన వ్యక్తులను సైతం ఆయన టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. వారిపై ఇష్టానుసారం కేసులను నమోదు చేస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఘటనకు సంబంధించి మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిప్పుతో చెలగాటం ఆడటం లాంటిదే. మీడియాను భయపెట్టి తను మనుగడ సాధించాలని చూడడం చూస్తే తర్వాత రోజుల్లో జగన్ ప్రభుత్వానికి గడ్డు కాలం తప్పదు.

ఎం జరిగింది అంటే??

ప్రకాశం జిల్లా సింగరాయకొండ లో లక్ష్మీ నరసింహ ఆలయం గోపురంపై ఉన్న కొన్ని దేవతా విగ్రహాలను పగలగొట్టారు అంటూ ప్రచారం వచ్చింది. పలు మీడియాలోనూ బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. అసలే హిందూ దేవాలయాల మీద దాడులు తీవ్రమై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్నిదుయ్యబట్టేందుకే తరుణంలో సింగరాయకొండ లో ఏమీ జరగకుండా మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వానికి చిర్రెత్తు కొచ్చిలా చేసింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు వచ్చిన కథనాలను బట్టి… వాటిని ఫేక్ న్యూస్ గా నిర్ధారించి ఎవరెవరు దానిని ప్రెస్ చేశారు అనే దాని మీద దర్యాప్తు చేశారు. దర్యాప్తులో పలు మీడియా విభాగాలకు చెందిన రిపోర్టర్లు ప్రతినిధులు ఉన్నట్లు గుర్తించి వారందరూ పై కేసులు నమోదు చేశారు.

నిందితులు వీరే!!

అసత్య సమాచారాన్ని ఇష్టానుసారం స్ప్రెడ్ చేశారనే ఆరోపణలపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద సెక్షన్ 120(బి) కుట్రపూరితంగా నేరానికి పాల్పడడం, సెక్షన్ 153 (ఏ), రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం, సెక్షన్ 295 (ఏ), మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేయడం, సెక్షన్ 504 ప్రజా శాంతికి భంగం కలిగించడం వంటి ఆరోపణలపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసులో నిందితులుగా అంబటి శివ కుమార్ ( బహుజన మీడియా), సాగి శ్రీనివాసరావు ( ధర్మ వ్యూహం న్యూస్ పేపర్), పోకూరి కిరణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, షేక్ బాషా ఎన్టీవీ రిపోర్టర్, కాట్రగడ్డ రామ్మోహన్ హెచ్ఎంటీవీ రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. ఏబీఎన్ ఈటీవీ ప్రతినిధులు మీద కొందరు యూట్యూబ్ ఛానల్ మీద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

అతికి బహుమతి!!

మీడియా మీద నియంత్రణ మీడియాను తమ చేతుల్లో పెట్టుకోవాలని చూసేవారికి ఎప్పుడూ తర్వాత గడ్డు కాలం వస్తుంది. దీనిని జగన్ ప్రభుత్వం గుర్తిస్తే మేలు. విగ్రహాల ధ్వంసం వేల విపక్షాల చేస్తున్న యాగి ఇలా కక్ష రూపంలో తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి కాస్త రిలీఫ్ గా అనిపించవచ్చు గాని… ప్రజల్లో ఇది ఖచ్చితంగా ఒక చెడు సంకేతాన్ని తీసుకు వెళుతుంది.
** మరో పక్క మీడియా ప్రతినిధులు సైతం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఉన్న వాట్స్అప్ రిపోర్టింగ్ లో ఇలాంటివి చేస్తూ అనవసరంగా ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాలని చూస్తే కేసులు అరెస్టు లో జైలు మీడియా ప్రతినిధులకు తప్పవు. ప్రస్తుతం మీడియా కూడా చిన్న విషయాన్ని అతి చేసి దానికనుగుణంగా ఏదో సాధించే చేయాలన్నా అతి చేస్తూ కొందరు రిపోర్టర్లు ప్రవర్తిస్తున్నారు. కేవలం వాట్సాప్ లో వచ్చిన లేకపోతే గ్రూపులో వచ్చిన సందేశాలను యధావిధిగా బ్రేకింగ్ న్యూస్ లకు తోసేస్తూ పబ్బం గడుపుకునే రిపోర్టింగ్ వ్యవస్థ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇలాంటి వాట్సాప్ రిపోర్టింగ్కు సింగరాయకొండ సంఘటన తర్వాత మీడియా ప్రతినిధి మీద కేసులు ఒక మంచి గుణపాఠం నేర్పుతాయి అనడంలో సందేహమే లేదు.


Share
Comrade CHE

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

10 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

1 hour ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago